సంక్రాంతి పండుగ అంటే తెలుగు లోగిళ్లలో ఎంతటి సందడి వుంటుందో తెలిసిందే. సంక్రాంతి అంటే ఇక టాలీవుడ్ లో బాక్సీఫీస్ వద్ద బడా హీరోల వార్ తప్పదు. మరోవైపు సెలెబ్రిటీలు కూడా సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులతో బంధు మిత్రులతో సరదాగా గడిపేస్తుంటారు. ఈ సారీ మెగాస్టార్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపేందుకు బెంగళూరు వెళ్లనున్నారు. ఇక టాలీవుడ్ అగ్ర హీరోల్లో ప్రభాస్, మహేష్ లు మాత్రం ప్రస్థుతం షూటింగుల్లో బిజీగావున్నారు.

 

బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్థుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరగనుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ చిత్రం తరువాత మహేష్ ‘భరత్ అనే నేను’ మూవీ చిత్రంలో నటిస్తుండగా... ఈ మూవీ షూటింగ్ ప్రస్థుతం హైదరాబాద్ ఔట్ స్కట్స్ లో జరుగుతోంది. ‘సాహో’, ఇటు ‘భరత్ అనే నేను’ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

 

మహేష్ బాబు ఇటీవల హాలిడే ట్రిప్‌ను పూర్తి చేసి తిరిగి ‘భరత్ అనే నేను’ మూవీ షూటింగ్ హాజరయ్యాడు. హైదరాబాద్‌లోని శంకర్‌పల్లిలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ సోమవారం ప్రారంభంకాగా ఈ షూటింగ్‌కి మహేష్‌తో పాటు హీరోయన్ కైరా అద్వానీ కూడా హాజరయ్యారు.ప్రభాస్ విషయానికొస్తే ఇటీవల యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణకు దుబాయ్ పయనమైన ‘సాహో’ యూనిట్.. ఆ షెడ్యూల్‌ని వాయిదా వేసుకుని హైదరాబాద్‌ నగర శివార్లలో వేసిన సెట్‌లో షూటింగ్ జరపనున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ కొత్త షెడ్యూల్‌లో హీరో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ శ్రద్దాకపూర్ కూడా జాయిన్ కానుంది.