మోహన్ లాల్ ను భీమునిగా ఎంపిక చేయటానికి బలమైన కారణం ఉండి ఉంటుంది కొచ్చిలో మీడియా సమావేశంలో  మోహన్ లాల్ మహాభారత్ గురించి మాట్లాడిన ప్రభాస్

ఇటీవల కాలంలో బాహుబలి2 తర్వాత అంతే చర్చనీయాశంగా మారిన మరో సినిమా మహాభారత్. కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రకటించిన మహాభారత్ సినిమాలో మోహన్ లాల్ స్థానంలో భీమునిగా తాను నటించడం కన్నా... అతనే కరెక్టనీ, మోహన్ లాల్ తో కలిసి పని చేసే అవకాశం వస్తే తనకు సంతోషమని ప్రభాస్ అన్నాడు.

ఇటీవల మోహన్ లాల్ వెయ్యి కోట్ల మహాభారత్ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు ప్రశంసలతోపాటు కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్ గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే కూడా.. మహాభారత్ సినిమాలో మోహన్ లాల్ కంటే ప్రభాస్ భీముని పాత్రలో కరెక్ట్ గా సెట్ అవుతాడని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మళయాళ సినీ అభిమానులు కేఆర్కే ట్వీట్స్ పై దుమ్మెత్తిపోశారు.

ఇలాంటి రూమర్స్ పై స్పందించిన ప్రభాస్... మహాభారత్ సినిమాలో భీమునిగా మోహన్ లాల్ బదులు తాను చేయాలనే ఆలోచనే కరెక్ట్ కాదని, అయితే మోహన్ లాల్ తో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని ప్రభాస్ స్పష్టం చేశాడు.

ఇటీవల బాహుబలి2 ఆడియో విడుదల కార్యక్రమానికి కొచ్చి వెళ్లిన ప్రభాస్ అక్కడి ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పై విధంగా స్పందించాడు. బాహుబలి కేరళలో 300 స్క్రీన్స్ పై రిలీజ్ కానుంది. తొలి రోజే 1500 షోలు వేయనున్నారు.