ఇప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు, ఆయన దేశంలోనే అత్యధిక మార్కెట్ వాల్యూ ఉన్న హీరో. నాలుగొందల కోట్ల వసూళ్లయినా అలవోకగా రాబట్టేస్తున్నారు. ఆయనతో సినిమా చేయాలనుకునే దర్శకుల లిస్ట్ కూడా బాగా పెద్దదై పోయింది. అందుకే ప్రభాస్ ది బెస్ట్ అన్నదర్శకులతోనే సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రభాస్ తో ఆదిపురుష్ మూవీ తెరకెక్కించనున్న దర్శకుడు ఓం రౌత్ తన అత్యుత్తమ సబ్జెక్టు తో ప్రభాస్ ని ఒప్పించినట్లు తెలుస్తుంది. దానికితోడు ప్రభాస్ చాలా పెద్ద మొత్తంలో పారితోషికంగా అందుకుంటున్నాడట. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీలో నటిస్తున్న ప్రభాస్, ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీలో నటించనున్నారు. అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని దాదాపు 500కోట్ల బుడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అంటుండగా ప్రభాస్ పాత్రపై క్రేజీ రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. రాధే శ్యామ్ తరువాత ప్రభాస్ 21 మరియు మరియు ఆదిపురుష్ చిత్రాలు ప్రభాస్ పూర్తి చేయాల్సివుంది. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసే నాటికి కనీసం మూడు నుండి నాలుగేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలు నేపథ్యంలో ఇంకా ఎక్కువ సమయమే పట్టవచ్చు. 

కాబట్టి రానున్న ఐదేళ్లలో ప్రభాస్ మరో దర్శకుడితో మూవీ చేసే అవకాశం లేదు. అలాగే ఈ చిత్రాలు చిత్రీకరణ సమయంలో మరో క్రేజీ సబ్జెక్టుతో బడా డైరెక్టర్ వస్తే మరలా ఆయన ఆ చిత్రానికి కమిటైయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ కోసం నేషనల్ లెవెల్ లో స్టార్ డైరెక్టర్స్ ఎదురుచూస్తూ ఉండగా, టాలీవుడ్ దర్శకులు ఆయన్ని కన్విన్స్ చేయడం కష్టమే అనిపిస్తుంది.కాబట్టి వచ్చే ఐదేళ్లలు ప్రభాస్ ఫుల్ బిజీ కానున్నాడు.