యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌ పెట్టి ప్యాన్ ఇండియా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ఈ క్రమంలో త‌న 20వ చిత్రం రాధేశ్యామ్ ఇంకా పూర్తి కాక ముందే రెండు సినిమాల‌ను అనౌన్స్ చేశారు. అంద‌లో ఒక‌టి నాగ్ అశ్విన్ సినిమా ఒక‌టి. కాగా.. మ‌రో చిత్రాన్ని మొన్న  ఓ కొత్త సినిమా  ప్ర‌క‌టించారు. అది కూడా ప్ర‌భాస్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్‌ కావటం విశేషం. దాంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.

 ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ‘ఆదిపురుష్‌’ అనే చిత్రాన్ని తెలుగు, హిందీలో రూపొందిస్తే మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌లు స‌హా ప‌లు భాష‌ల్లో అనువదించి విడుద‌ల చేస్తారు. రామాయ‌ణంలో రాముడు చెడు(రావ‌ణుడు)పై సాధించిన విజ‌యంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ గురించి ఓ వార్త బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా 2021లో ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమా 2022 దీపావళికి రిలీజ్ కానుంది. డైరక్టర్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించారు. డైరక్షన్, రైటర్స్ టీమ్ అందరూ ఈ రోజు ముంబైలో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. రేపు రిజల్ట్ వచ్చాక పని ప్రారంభం కానుంది. 
  
ఇక ఈ సినిమాలో ప్రభాస్ ని ఎదుర్కొనే విలన్ ...కూడా మంచి స్టామినా గలిగిన వాడై ఉండాలి. ఆ స్దాయి ఉన్న విలన్ కోసం దర్శక,నిర్మాతలు సైఫ్ అలీఖాన్ ని ఖరారు చేసారు. సైఫ్ అయితే బాలీవుడ్ లోనూ క్రేజ్ ఉంటుందనేది వారి ఆలోచనగా చెప్తున్నారు.