జూన్ 16న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఇప్పుడో న్యూస్ బీటౌన్‌లో వినపడుతోంది.
ఏ సినిమాకైనా ఇప్పుడు ఓటిటి డీల్ అనేది ముఖ్యంగా మారిపోయింది. సినిమా స్దాయిని బట్టి, అందులో నటించిన స్టార్ ని బట్టి ఓటిటి రేటు ఎంతనేది డిసైడ్ అవుతోంది. నిర్మాణంలో ప్రతీ పెద్ద చిత్రమూ ఓటిటి డీల్ రిలీజ్ కు ముందే అయ్యిపోతోంది. ఇక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో … మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినపడుతోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఇప్పుడో న్యూస్ బీటౌన్‌లో హల్చల్ చేస్తోంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ఆదిపురుష్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్(Adipurush Digital Rights) ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'(Amazon Prime Video) ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఇన్‌సైడ్ టాక్. ఆదిపురుష్ సినిమా కోసం.. సుమారు 550 కోట్ల వరకూ ఖర్చు చేశారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలూ కలిపి.. దాదాపు 250 కోట్లకు అమ్మేసినట్టు టాక్.
ఇక తిరుమల వెంకన్న సాక్షిగా.. నేడు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈరోజు (జూన్6) సాయంత్రం జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు.. ఇప్పటి వరకూ ఏ సినిమాకు గెస్ట్ గా రాని శ్రీ తిదిండి చినజీయర్ స్వామి విచ్చేస్తున్నారు. రామాయణం ఆధారంగా సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిన్న రాత్రే తిరుమలకు చేరుకున్న ప్రభాస్.. శ్రీవారిని దర్శించుకుని, ఆయన సేవలో పాల్గొన్నారు. బాహుబలి సెంటిమెంట్ తో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి మొత్తం ఆదిపురుష్ మేనియా స్టార్ట్ అయింది. ఆకాశమే హద్దుగా ప్రీ రిలీజ్ వేడుకలకు అభిమానులు సిద్ధమవుతున్నారు. జై శ్రీరామ్ అనే నినాదంతో తిరుపతి మారుమ్రోగనుంది.
