Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ “కల్కి” ఏ OTT లో...ఎప్పటి నుంచి

ప్రభాస్ హీరోగా   దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898 ఎడి”.ఈ రోజు  రిలీజ్ కి అయిన  ఈ చిత్రం 

Prabhas #Kalki2898AD OTT Release Date and Time jsp
Author
First Published Jun 27, 2024, 7:26 PM IST


 భారీ అంచనాలతో వచ్చిన   “కల్కి 2898 ఎడి” అంతే భారీగా రిలీజైంది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌ మేనియా కనిపిస్తోంది. మార్నింగ్ షోకే సినిమా సూపర్ హిట్ అందుకోవటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దేలేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్ ఎవరు తీసుకున్నారు. ఎప్పటి నుంచి ఓటిటిలో వచ్చే అవకాసం ఉందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. 

రీసెంట్ గా నెట్ ప్లిక్స్ వారు భారీగా తెలుగు సినిమాలు తీసుకున్నారు. దాంతో వారికే ఈ రైట్స్ కూడా వెళ్ళయానుకున్నారు. కానీ   ‘కల్కి’ సినిమా దక్షిణాది భాషల హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, హిందీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. అయితే ఈ స్దాయి సక్సెస్ అందుకున్న సినిమాని ఓటిటి లో ఇప్పుడిప్పుడే ఎక్సపెక్ట్ చేయలేం. అందులోనూ నార్త్ లో ఉన్న రూల్ ప్రకారం మినిమం ఎనిమిది వారాలు  తర్వాతే ఓటిటిలోకి వస్తుంది. ఇంకా పెంచినా రోజులు పెరగచ్చు.  

తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన వినూత్న ప్రయోగం ఈ సినిమాని చూసిన వాళ్లు పొగుడుతున్నారు. మూడు గంటలపాటు ప్రేక్షకుడికి హాలీవుడ్‌ సినిమాను చూస్తున్న ఎక్స్‌పీరియన్స్‌ని అందించటంలో  దర్శకుడు నాగ్‌అశ్విన్‌ సక్సెస్ అయ్యారు. వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుందో  చూపిస్తూ.. మరోవైపు మన పురాణాల్లోని పాత్రల్ని ఈ కథలో ఇన్వాల్వ్‌ చేస్తూ ఓ కొత్త అనుభూతిని అందించాడు. ‘కల్కి 2898ఏడీ’ చూస్తుంటే తెలుగు సినిమా నెక్స్ట్ లెవిల్ కు వెళ్లిందని గర్వపడే స్దాయిలో ఉంది. 


ప్రభాస్ హీరోగా   దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898 ఎడి”.ఈ రోజు  రిలీజ్ కి అయిన  ఈ చిత్రం  వరల్డ్ వైడ్ గా భారీగానే బిజినెస్ జరుపుకుంది.  తెలుగు సహా హిందీ, తమిళ్ లో కూడా గ్రాండ్ గానే రిలీజ్ అయ్యింది.  కాంప్రమైజ్ అనకుండా  అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను నిర్మించారు సి.అశ్వనీదత్‌. ఈ సినిమా పుణ్యమా.. తెరపై ఓ కొత్తలోకాన్ని ప్రేక్షకులు చూడొచ్చు. వైవిధ్యమైన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘కల్కి 2898 ఏడీ’ తప్పకుండా నచ్చుతుంది.
  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios