రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ‘కల్కి’.. విడుదల తర్వాత కూడా హవా కొనసాగిస్తోంది.
ప్రభాస్ ‘కల్కి’ సినిమా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు కమల్ ,అమితాబ్ వంటి స్టార్ హీరోల నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ‘కల్కి’.. విడుదల తర్వాత కూడా హవా కొనసాగిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నార్త్ బెల్ట్ లో ఈ చిత్రం 222 కోట్ల నెట్ రీచ్ అవుతోంది. ఈ వారం కూడా ఈ సినిమాకు అక్కడ పోటీ లేదు. హిందుస్దానీ 2 (ఇండియన్ 2), అక్షయ్ కుమార్ సర్ఫిరా సినిమా కూడా అక్కడ భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవటం కల్కికు ప్లస్ అవుతోంది. కమల్ నటించిన ఇండియన్ 2కు ఇనానమస్ గా అన్ని చోట్ల నుంచి ప్లాఫ్ టాక్ వచ్చింది.
అక్షయ్ కుమార్ సర్ఫిరా సూర్య (Suriya) హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) కు రీమేక్‌గా రూపొందింది.సర్ఫిరా సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించింది. ఈ మూవీతోనే ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పరేష్ రావెల్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. రాధికా మదన్ హీరోయిన్‌గా నటించింది. ఈ బాలీవుడ్ మూవీలో సూర్య గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఈ మూవీకి సూర్య సతీమణి జ్యోతిక ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.
సూరారై పొట్రు హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానెల్ సొంతం చేసుకున్నది. సర్ఫిరా థియేటర్లలో రిలీజైన శుక్రవారం రోజే గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానెల్ సూరారై పోట్రు హిందీ డబ్బింగ్ మూవీని యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఒకేరోజు అటు థియేటర్లలో అక్షయ్ కుమార్ మూవీ...యూట్యూబ్‌లో సూర్య సూరారై పొట్రు హిందీ డబ్బింగ్ మూవీ రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మినిమం కలెక్షన్స్ లేకుండా పోయాయి.
ఇది కల్కికు ప్లస్ అయ్యింది. ఈ వారాంతంలో ఈ సినిమా 250 కోట్లు నెట్ నార్త్ లో రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ రెండు సినిమాలు ఏ మాత్రం బాగున్నా కల్కి పై ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ పడేది. ఆ రకంగా కమల్, అక్షయ్ కుమార్ కలిసి కల్కికు హెల్ప్ చేసరిరనట్లు అయ్యింది.
కాగా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. కల్కి’లో కమల్ హాసన్ విలన్‌గా కనిపించారు. సుప్రీం యాస్కిన్ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు. ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.
