ప్రభాస్ ‘కల్కి’వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

కమల్ హాసన్, దీపికా పదుకోణ్, శోభన, పశుపతి, దిశా పటానీ వంటి భారీ తారాగణం కూడా ఉండటంతో ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ లా అనిపించిందీ మూవీ. 

Prabhas Kalki 2898 AD Worldwide Closing Collections jsp


 ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) థియేటర్స్ రన్ పూర్తి అయ్యిపోయింది. ఈ సినిమా నుంచి రావాల్సిన కలెక్షన్స్ మాగ్జిమం పిండేసింది.  ఈక్రమంలో ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ రెండింట్లో ఆగస్ట్ 22  నుంచి కల్కిని డిజిటల్ ప్రీమియర్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ట్రేడ్ ద్వారా బయిటకు వచ్చాయి.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు...  జూన్ 27న విడుదలైన కల్కి ఏడి 2898 మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రం  1,025 కోట్ల గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అందులో షేర్  ₹500 కోట్లు. ఇందులో తెలుగు రాష్టాల షేర్ జీఎస్టీతో కలిసి ఉంది. అలాగే 3D ఛార్జెస్ కలపలేదు. ఓవర్ సీస్ మార్కెట్, హిందీ బెల్ట్, కేరళ లలో ఆర్.ఆర్.ఆర్ ని మించి పోయింది.  దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లింది. ఫస్ట్ పార్ట్ మొత్తం  మోసింది అశ్వథ్థామ గా వేసిన అమతాబ్ బచ్చన్ అయినా.. ప్రభాస్ ఛరిష్మాతోనే ఓపెనింగ్స్ వచ్చాయి. కమల్ హాసన్, దీపికా పదుకోణ్, శోభన, పశుపతి, దిశా పటానీ వంటి భారీ తారాగణం కూడా ఉండటంతో ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ లా అనిపించిందీ మూవీ. 

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే వరల్డ్ వైడ్ గా కల్కి 2898 ఏడీ చిత్రం థియేటర్ హక్కులను ఏకంగా రూ. 394 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది ఆంధ్రాలో ఈ సినిమాకు రూ. 85 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే నైజాం థియేట్రికల్ హక్కులను రూ.70 కోట్లకు, సీడెడ్ లో రూ.27 కోట్లకు విక్ర‌యించారు. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే క‌ల్కి థియేట్రికల్ బిజినెస్ రూ.182 కోట్లు కాగా.. కర్ణాటకలో రూ.30 కోట్లు మ‌రియు తమిళనాడు, కేరళలో రూ.22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. 

ఉత్తరాదిలో క‌ల్కి మూవీని ఏఏ ఫిల్మ్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. స‌ద‌రు సంస్థ రూ.80 కోట్లకు క‌ల్కి హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. ఇక‌పోతే విదేశాల్లోనూ ప్ర‌భాస్ కు మంచి క్రేజ్ ఉండ‌టం వ‌ల్ల ఓవ‌ర్సీ లో క‌ల్కి మూవీ థియేట్రికల్ హక్కుల ధ‌ర‌ రూ.80కోట్లు ప‌లికాయి. మొత్తంగా ఈ చిత్రం రూ. 394 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుపుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. 

ఇక సినిమా ఆరంభంలోనూ, చివర్లోనూ వచ్చిన కురుక్షేత్రం ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. అయితే టికెట్ రేట్ భారీగా ఉండటంతో మళ్లీ మళ్లీ చూడాలనుకున్న ప్రేక్షకులు కాస్త వెనక్కి తగ్గారు. అయితేనేం ఇప్పుడు ఓటిటిల్లో ఎప్పుడు చూద్దామా అంటూ ఆతృతగా ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 22 నుంచి కల్కి మూవీ స్ట్రీమ్ కాబోతోంది. ప్రైమ్ లో కేవలం సౌత్ లాంగ్వెజెస్ లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. రెండు మూడు  రోజుల తేడాలో నెట్ ఫ్లిక్స్ లో నార్త్ లాంగ్వెజెస్ లో స్ట్రీమ్ అవుతుంది.  
  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios