Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ 'కల్కి 2898 AD' ట్రైలర్ మైండ్ బ్లోయింగ్.. రికార్డ్స్ చూసుకో ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు

జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ అని ప్రకటించగానే ఒక్కసారిగా కల్కి ఫీవర్ పెరిగిపోయింది. అసలు కల్కి లో నాగ్ అశ్విన్ ఎలాంటి కథ చూపించబోతున్నారు అనే ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. అందరి ఉత్కంఠకి తెరదించుతూ కల్కి ట్రైలర్ వచ్చేసింది. 

Prabhas Kalki 2898 AD Trailer out now dtr
Author
First Published Jun 10, 2024, 7:43 PM IST

ఈ ఏడాది విడుదల కాబోతున్న అతిపెద్ద పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 AD. ప్రభాస్ కెరీర్ లోనే ఆ మాటకొస్తే ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు ఇది. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు అంటూ ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు, వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ అని ప్రకటించగానే ఒక్కసారిగా కల్కి ఫీవర్ పెరిగిపోయింది. అసలు కల్కి లో నాగ్ అశ్విన్ ఎలాంటి కథ చూపించబోతున్నారు అనే ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. మహాభారతం సమయం నుంచి కలియుగంలో కల్కి అవతరించే వరకు ఈ కథ ఉంటుందని వార్తలు వచ్చాయి. అందరి ఉత్కంఠకి తెరదించుతూ కల్కి ట్రైలర్ వచ్చేసింది. 

ఊహించిన విధంగానే విజవల్స్ కనీవినీ ఎరుగని విధంగా ఉన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పినట్లుగానే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. మోడ్రన్ యుద్ధంలో కనిపించే భారీ ఆయుధాలు, మెషీన్స్ అబ్బురపరుస్తున్నాయి. రికార్డ్స్ చూసుకో ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. ఇది కూడా ఓడిపోను అంటూ ప్రభాస్ చెబుతున్న డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. 

రాజేంద్ర ప్రసాద్ డైలాగులతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. భూమ్మీద మొదటి నగరం.. చివరి నగరం కాశీ అంటూ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ తో ఒక చిన్న బాలుడు మాట్లాడుతుంటాడు. భూమి మీద తాగడానికి నీళ్లు కూడా లేని స్థితి కనిపిస్తుంది. భూమిని మొత్తం పీల్చేస్తే మొత్తం ఆకాశంలోనే ఉంటుంది అంటూ రాజేంద్ర ప్రసాద్ జరుగుతున్న ఉపద్రవాలని వివరిస్తాడు. 

భారీ స్థాయిలో ఉన్న మెషీన్స్, ఆయుధాలు, నౌకలు అబ్బురపరుస్తున్నాయి. ఆ తర్వాత అమితాబచ్చన్ పోషిస్తున్న అశ్వథామ పాత్ర పరిచయం జరుగుతుంది. నీలాంటి వాడు ఎంతమందిని రక్షించ వచ్చో తెలుసా అని ఓ కుర్రాడు అడుగుతాడు. దీనికి అమితాబ్ నేను రక్షించాల్సింది ఒక్కడినే అని బదులిస్తాడు. 

ఆరువేల సంవత్సారాల క్రితం కనిపించిన శక్తి మళ్ళీ రాబోతున్నట్లు రాజేంద్ర ప్రసాద్ ఒక వ్యక్తిని చెబుతుంటాడు. ఇక వెలుగు వచ్చే సమయం అయింది అని అంటాడు. ఆ తర్వాత దీపికా పదుకొనె పాత్ర పరిచయం ఉంటుంది. ఆమె ఓ బిడ్డని కనేందుకు రెడీగా ఉంటుంది. ట్రైలర్ లో ఎక్కువగా ఏదో కాంప్లెక్స్ అనే పదం వినిపిస్తోంది. ప్రభాస్ దాని గురించి కలలు కంటుంటాడు. ఫన్నీగా ప్రభాస్ పాత్ర పరిచయం జరిగినప్పటికీ ఆ తర్వాత పవర్ ఫుల్ గా మారుతాడు. 

 

కొంతమంది దీపికా పదుకొనే కోసం వెతుకుతుంటారు. ప్రభాస్ కి ఆ టాస్క్ అప్పగిస్తారు. రికార్డ్స్ చూసుకో.. ఇంతవరకు నేను ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అని ప్రభాస్ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. యాక్షన్ సీన్స్ అయితే నిజంగానే హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్ చివరి 30 సెకండ్లు యాక్షన్ సీన్స్ తో నిండిపోయింది. 

ఇక చివర్లో కమల్ హాసన్ పాత్ర భయంకరంగా ఉంటుంది. విచిత్రమైన గెటప్ లో కమల్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ప్రాణం కోసం ఇంత మందిని బలితీసుకోవడం ఏంటి అని దీపికా అడగగా.. భయపడకు అంటూ కమల్ విచిత్రమైన వాయిస్ తో ఒళ్ళు గగుర్పొడిచేలా కనిపిస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios