‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంతో జరుగుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా ఇటలీలోని అద్భుతమైన లొకేషన్స్‌లో ప్రభాస్, దిశా పటానిపై పాట చిత్రీకరించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై బజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది.
అదే సమయంలో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘Kalki 2898ad చిత్రం రిలీజ్ అనుకున్న తేదీకు వస్తుందా రాదా అనే డిస్కషన్ మాత్రం ఆగటం లేదు. ఈ చిత్రం మే 9న విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ నేపధ్యంలో ఆ రిలీజ్ డేట్ కష్టమే అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాయిదాపడుతుంది.
కానీ దర్శక,నిర్మాతలు మాత్రం ఈ రిలీజ్ డేట్ విషయమై సైలెంట్ గా ఉంటున్నారు. అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు చిత్రం టీమ్ ఈ రిలీజ్ డేట్ విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్నారట. మాగ్జిమం మే 30 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి వదులుదామనే నిర్ణయంలో ఉన్నారంటున్నారు. అప్పటికి ఎలక్షన్స్ వేడి తగ్గిపోతుంది. సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసినట్లు ఉంటుంది. సమ్మర్ శెలవులను క్యాష్ చేసుకోవచ్చు. ఇక ఈ రిలీజ్ డేట్ మార్పు విషయమై ఇప్పటికి అధికారిక ప్రకటన అయితే నిర్మాణ సంస్ద నుంచి రాలేదు.
నాగ్ అశ్విన్ రీసెంట్ ఓ మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు. అలాగే మేము ఇక్కడ మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. ముఖ్యంగా ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కల్కి తో పాటు రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాలు .. ప్రభాస్ కు క్యూలో ఉన్నాయి.
