Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజే ‘కల్కి’భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. , లైవ్ ఎక్కడ చూడాలి?

 ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్ తో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. 

Prabhas Kalki 2898 AD pre-release event details are here jsp
Author
First Published Jun 19, 2024, 12:23 PM IST | Last Updated Jun 19, 2024, 12:23 PM IST


ప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, గ్లింప్స్, సాంగ్ తో సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే సినిమాకు తగ్గ రేంజిలో ప్రమోషన్స్ లేవనే కంప్లైంట్ వినిపిస్తోంది.ముఖ్యంగా ప్రీ రిలీజ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలో ఈ రోజు ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్న విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.

ఈ రోజు  నార్త్ బెల్ట్ కోసం ముంబైలో  గ్రాండ్ గా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.   సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే ముంబై ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ ని కేవలం వైజయంతి నెట్ వర్క్ యూట్యూబ్ ఛానల్ లో మాత్రమే లైవ్ ఇస్తున్నారు. ప్రభాస్ ఈ ఈవెంట్ లో అభిమానులతో మాట్లాడతారని ,సినిమా గురించి ఇన్ సైట్స్ ఇవ్వబోతన్నట్లు రివీల్ చేసారు. సినిమా కు పనిచేసిన టీమ్ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతోంది.ఈ ఈవెంట్ కి పలువురు బాలీవుడ్ ప్రముఖులుకూడా హాజరవుతారని సమాచారం. 

తెలుగులో కూడా త్వరలోనే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం.  కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో గ్రాండ్ గా చేయాలని, దానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని గెస్టులుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అశ్వినీదత్ అడగడం, అమరావతిలో భారీ సినిమా ఈవెంట్ అంటే చంద్రబాబు కూడా ఓకే అంటారు. అలాగే ఈ ఈవెంట్ కు కల్కి సినిమాలో నటిస్తున్న ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లను కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో కల్కి సినిమా కంటే కూడా ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు.

మరో ప్రక్క ప్రభాస్ ఫ్యాన్స్ ముంబైలో ఏ రేంజ్ లో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారో, ప్రభాస్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు. ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం 6 గంటల నుండి ఈ కింది వీడియో లింక్ లో చూడవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios