పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ప్రమోషన్లతో హోరెత్తించడానికి రెడీ అవుతున్నారు టీమ్. ఈక్రమంలో ట్రైలర్ రిలీజ్ పై సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు కల్కీ టీమ్.  

నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుత ప్రపంచ కల్కి. ప్రభాస్ ను డిఫరెంట్ గా చూపించబోతున్న సినిమా ఇది. ఈ వరల్డ్ లోకి అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ప్రభాస్ అభిమానులతో పాటు.. ఆడియన్స్ అంత ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న తరుణం దగ్గరలోనే ఉంది. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా నుంచి భారీ అప్ డేట్ ఒకటి వచ్చింది. సాలిడ్ ట్రైలర్ ను చూపించేయడానికి టీమ్ రెడీ అవుతోంది. దాని కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు టీమ్. 

కల్కి కాన్సెప్ట్ తెలిసి..ఈ సినిమాను థియేటర్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కానీ.. రకరకాల కారణాల వల్ల ఈమూవీ చేత పోస్టుపోన్ అవుతూ వస్తుంది. అయినా సరే ప్రేక్షకులు ఏ మాత్రం కోపం చూపించకుండా.. మూవీ టీమ్ మీద.. నాగ్ అశ్వీన్ మీద నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ను తాజాగా రిలీజ్ చేశారు టీమ్. 


జూన్ 27 న థియేటర్స్ లో కల్కీ మ్యానియా స్టార్ట్అవ్వబోతోంది. స్క్రీన్ ను చిరిగిపోయేలా.. బాక్స్ లు దద్దరిల్లిపోయేల.. ప్రభాస్ ప్రభంజనానికి రెడీ అవుతున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రపంచ వ్యాప్తంగారి లీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఎట్టకేలకు యూ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చేశారు టీమ్. “కల్కి 2898AD” సినిమా ట్రైలర్ జూన్ 10 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

కల్కి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా ప్రేక్షకులకు అంచనాలను పెంచుతూనే ఉంది. ఇప్పటికె ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన కొన్ని పోస్టర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఇప్పటివరకు ఏ సినిమా కు చేయని విధంగా మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. అసలు కల్కి వరల్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందు. ఆడియన్స్ డౌట్స్ ను క్లియర్ చేస్తున్నారుటీమ్. 

అసలు కల్కి ప్రపంచం ఎలా ఉండబోతుందో .. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు ఎటువంటి సందేహాలు రాకుండా ఉండడం కోసం రీసెంట్ “బుజ్జి అండ్ భైరవ” పేరుతో యానిమేటెడ్ సిరీస్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ కు విపరీతమైన స్పందన లభిస్తుంది. కాబట్టి కల్కి ప్రపంచంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూస్తే అర్ధం అవుతుంద. ఇక ఈసినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.