Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కు అరుదైన గౌరవం, రాష్ట్రపతి, ఢిల్లీ సిఎం తో కలిసి ఒకే వేదికపై యంగ్ రెబల్ స్టార్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ఏ హీరోకు దక్కని స్పెషల్ ఆహ్వానం మన యూనివర్సల్ స్టార్ కు అందింది. ఏకంగా రాష్ట్రపతి, సీఎంతో కలిసి ఆయన ఓ కార్యక్రమంల పాల్గొన బోతున్నారు. 
 

prabhas invited to ravan dahan at delhi
Author
First Published Oct 4, 2022, 10:18 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్  ప్ర‌భాస్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే రావ‌ణ ద‌హ‌నానికి హాజ‌రు కావాలంటూ ఆయ‌న‌కు ఆహ్వానం అందింది. ఈ మేర‌కు ప్ర‌భాస్‌కు రాంలీలా క‌మిటీ నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం. ఏ హీరోకు రక్కని విధంగా ఏకంగా రాష్ట్రప‌తి, సిఎంలతో కలిసి ప్రభాస్ ఈకార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 

ద్రౌప‌ది ముర్ముతో పాటు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ల‌తో క‌లిసి ప్ర‌భాస్ ఈ వేడుక‌కు హాజ‌రు కానున్నారు. ప్రతీ ఏడాది రామ్ లీలా మైదాన్ లో రావణ దహనం కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. ప్రముఖులంతా ఈ ఈవెంట్ లో పాల్గోంటారు. కాని ఇప్పటి వరకూ సౌత్ నుంచి ఏ స్టార్ పాల్గొనలేదు. ఫస్ట్ టైమ్ ప్రభాస్... అతిథిగా ఇందులో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. 

క‌రోనా కార‌ణంగా రెండేళ్లుగా రాంలీలా మైదానంలో రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేదు. క‌రోనా టైమ్ అయిపోవడంతో..కేసులు  భారీగా త‌గ్గిపోయిన నేప‌థ్యంలో ఈ ఏడాది రావ‌ణ ద‌హ‌న వేడుక‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు రాంలీలా క‌మిటీ తీర్మానించింది. ఈ ఈవెంట్ కు సింక్ అయ్యే విధంగా రాముడిగా ప్రభాస్ నటిస్తుండటంతో... ఆయనకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. 

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాంలీలా మైదానంలో రావ‌ణ ద‌హ‌నానికి హాజరు కావాలంటూ ఆయ‌న‌కు రాంలీలా క‌మిటీ ప్ర‌త్యేకంగా ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానం మేర‌కు ప్ర‌స్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో ఉన్న ప్ర‌భాస్ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీకి బ‌య‌లుదేరారు.

టాలీవుడ్ హీరోగా స్టార్ట్ అయిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆదిపురుష్ తో పాటుగా ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్ , ఇలా ఐదు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. మరి ఆదిపురుష్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. టీజర్  విషయంలో మాత్రం  చాలా ట్రోల్స్ ను ఫేస్ చేశారు ఆది పురుష్ టీమ్. 

Follow Us:
Download App:
  • android
  • ios