యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇండియన్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రభాస్, హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

ప్రభాస్ పెళ్లెప్పుడనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారిన ప్రశ్న. బాహుబలితో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా మారిపోయాడు. దీనితో ప్రభాస్ మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా పెళ్లెప్పుడనే ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

నా పెళ్లి జరగాల్సినప్పుడు జరుగుతుంది.. అది ప్రేమ వివాహం కూడా కావొచ్చు అని ప్రభాస్ తెలిపాడు. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ పెళ్లి గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో ఇంటర్వ్యూలో ప్రభాస్ తనకు, అనుష్కకు మధ్య ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు వస్తున్న వార్తలపై సీరియస్ అయ్యాడు. తనని అనుష్కతో ఎప్పుడైనా సీక్రెట్ గా చూశారా అని ప్రభాస్ ప్రశ్నించాడు.