Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్‌ ఇన్‌స్టా డిలీటెడ్‌.. హ్యాకింగ్‌కి గురైందా?

తాజాగా ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ చూపించడం లేదు. డిలీట్‌ అయినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రభాస్‌ ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాకింగ్‌కి గురైనట్టు తెలుస్తుంది. 

prabhas instagram account hacked arj
Author
First Published Oct 15, 2023, 4:55 PM IST

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు. మొదటి పాన్‌ ఇండియా యాక్టర్‌గా నిలిచి, ఆ తర్వాత ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు వరుసగా భారీ సినిమాలతో రాబోతున్నారు. ఆయన చిత్రాల్లో రెండు భారీ చిత్రాలున్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో నుంచి ప్రభాస్‌ హవా సాగబోతుంది. 

ఇదిలా ఉంటే ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఉంది. అలాగే ఫేస్‌ బుక్‌ కూడా రన్‌ చేస్తున్నారు. కానీ ట్విట్టర్‌లో మాత్రం లేదు. ఆయన ఏం పోస్ట్ పెట్టాలన్నా `ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతారు. లేదంటే చాలా రేర్‌ కేసులో ఫేస్‌ బుక్‌లోకి వెళ్తారు. 

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ చూపించడం లేదు. డిలీట్‌ అయినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రభాస్‌ ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాకింగ్‌కి గురైనట్టు తెలుస్తుంది. ఆయన అకౌంట్‌ కనిపించడం లేదు. అందుబాటులో లేదు అని వస్తుంది. హ్యాకింగ్‌కే గురైనట్టు అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఆయన అకౌంట్‌ హ్యాక్‌ అయినట్టుగానే అనుమానిస్తున్నారు.

ఇక ప్రభాస్‌ ప్రస్తుతం `సలార్‌``తోపాటు `కల్కీ2989ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు మారుతి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఓ లుక్‌ లీకైంది. యాక్షన్‌ సీన్‌కి సంబంధించిన లుక్‌ ఇది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక `సలార్‌` డిసెంబర్‌ 22న విడుదల కాబోతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios