సలార్ మొదటి షెడ్యూల్ గోదావరి ఖని మైనింగ్ ఏరియాలో పూర్తి చేశారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారని సమాచారం. నైట్ మోడ్ లో జరిగే కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా, ప్రభాస్ తో పాటు హీరోయిన్ శృతి హాసన్ పాల్గొంటున్నారట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్ట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ త్వరిత గతిన పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రభాస్. భారీ ప్రాజెక్ట్స్ కావడంతో ఏళ్ల తరబడి సమయం పట్టేలా ఉంది. అయితే ప్రభాస్ నుండి 2022లో రెండు ప్రాజెక్ట్స్ రానున్నాయి. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్ సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన చేశారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ నెలల గ్యాప్ లో సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
కాగా సలార్ మొదటి షెడ్యూల్ గోదావరి ఖని మైనింగ్ ఏరియాలో పూర్తి చేశారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారని సమాచారం. నైట్ మోడ్ లో జరిగే కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా, ప్రభాస్ తో పాటు హీరోయిన్ శృతి హాసన్ పాల్గొంటున్నారట. ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం భారీ విలన్ డెన్ సెట్ ఏర్పాటు చేశారట. సలార్ లో కెజిఎఫ్ కి మించి యాక్షన్ సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సైతం చిత్రీకరణ జరుపుకుంటుంది. పౌరాణిక గాథగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ లో ప్రభాస్ రామునిగా కనిపించనున్నారు. ఇక టాలీవుడ్ క్రేజీ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించిన భారీ బడ్జెట్ ప్రాజెక్ట్... ఇటీవల లాంచ్ అయ్యింది. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకోనుంది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుండగా, అమితాబ్, దీపికా పదుకొనె వంటి ప్రముఖ నటులు భాగమయ్యారు.
