యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం సాహో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ లో యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్ అనిపించాయి. ఆగష్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఆదివారం రోజు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరుగుతున్నాయి. పోలీసులు వేడుకకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద ప్రభాస్ 60 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఏ కటౌట్ అభిమానులని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించే వివిధ గెటప్స్ కి సంబందించిన లుక్స్ ని కూడా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం రోజు సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. బాలీవుడ్ నటీనటులు నీల్ నితిన్ ముకేశ్, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. శ్రద్దా కపూర్ కథానాయకిగా నటించింది.