ప్రభాస్ కు బాలీవుడ్ నుంచి మరో అరుదైన గౌరవం

First Published 1, Dec 2017, 11:13 AM IST
prabhas honoured from bollywood again
Highlights
  • బాహుబలి చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయిన ప్రభాస్
  • ప్రభాస్ కు బాలీవుడ్ లోననూ యమా క్రేజ్
  • తాజాగా ఓ ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఈవెంట్ కు ఆహ్వానం

బాహుబలి’ మూవీతో టాప్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ జనవరిలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ దగ్గర జరగబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు అతిధిగా వెళ్ళబోతున్నాడు. ప్రముఖ నటీమణి, పార్లమెంట్ సభ్యురాలు, హేమమాలిని దర్శకుడు మధూర్ భండార్కర్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వన్ ఫర్ ఆల్ – ఆల్ ఫర్ వన్’ కార్యక్రమానికి దక్షిణాదికి సంబంధించి ప్రభాస్ కు ఆహ్వానం అందింది.

 

మన దేశ సరిహద్దులలో సేవలు అందిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్న మన వీర జవానుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించబోతున్న ఈ భారీ కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ హీరోలు అంతా పాల్గొంటున్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాల్గొనడం ప్రభాస్ కున్న ఇమేజ్ ఏంటో తెలియజేస్తుంది.

 

అధర్వా ఫౌండేషన్ నిర్వహణలో జరగబోతున్న ఈ కార్యక్రమంలో అనేకమంది వేలాది సంఖ్యలో కాలేజీ విద్యార్దులు కూడ పాల్గొనబోతున్నారు. అంతేకాదు మన వీరజవానుల త్యాగాలకు సంబంధించిన వాస్తవ సంఘటనలకు సంబంధించిన 10 షార్ట్ ఫిలిమ్స్ ను కూడ రూపొందించి దేశంలోని అన్ని ధియేటర్లలోను ప్రదర్శించబోతున్నారు. 

 

వీటికి సంబంధించి తెలుగులో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంటుంది అని తెలుస్తోంది. కరణ్ జోహార్ తో ఏర్పడ్డ భేదాభిప్రాయాలు వల్ల ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ కు బాలీవుడ్ మార్కెట్ లో సమస్యలు ఏర్పడ్డాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రభాస్ ను తిరిగి బాలీవుడ్ టాప్ హీరోల మధ్య నిలబెట్టే ఈవెంట్ గా ఈ కార్యక్రమం మారబోతోంది. ఏది ఎలా ఉన్నా ప్రభాస్ కు బాలీవుడ్ లో ఇది ఊహించని గౌరవం అనుకోవాలి.

loader