సాహోలో హీరోయిన్ గా అనుష్కను ఫైనల్ చేసిన టీమ్ తాజాగా బరువు సమస్య అవుతుండటంతో తప్పించిన సాహో టీమ్ తొలిసారిగా స్టార్ హీరోయిన్ అనుష్కకు ప్రభాస్ సినిమాతో అవమానం
చాలా రోజుల వరకు సాహో టీమ్ కు కునుకు లేకుండా చేసిన హీరోయిన్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. యువీ క్రియేషన్స్ బేనర్ పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహోలో వెతికి వెతికి చివరకు అనుష్కను ఫైనల్ చేశారు. అయితే ఇప్పుడు ప్రభాస్ సరసన అనుష్కను తప్పించారని తెలుస్తోంది.
సాహో చిత్రం నుంచి ఆమెను తొలగించడం ప్రభాస్, అనుష్క అభిమానులనే కాక సినీ వర్గాలను షాక్ గురిచేసింది. ఆమెను తొలగించడంతో సాహో చిత్రంలో హీరోయిన్ ఎంపిక మళ్లీ మొదటికివచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుష్కను తొలగించడం సెన్సేషన్‌గా మారింది. ఈ విషయంలో ప్రభాస్ కూడా ఏమీ చేయలేకపోయాడట.
అరుంధతి, బాహుబలి లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన మెప్పించిన అనుష్కకు సాహో రూపంలో చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కోసం యూవీ క్రియేషన్ నిర్వాహకులు బాలీవుడ్ అంతా వెతికారు. కానీ చివరికి అనుష్కను సంప్రదించడంతో తన నిర్ణయాన్ని చెప్పడానికి ఆమె చాలా సమయం తీసుకొంది. చివరికి ఆమె ఓకే చెప్పడంతో సాహో హీరోయిన్ ఎంపిక పూర్తయిందని అంతా ఊపిరి పీల్చారు. కానీ అనుహ్యంగా అనుష్కను తొలగించారనే విషయం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
అనుష్క తొలగింపుపై జాతీయ స్థాయి పత్రిక ఒకటి తన కథనంలో పేర్కొన్నది. ఆ వెబ్‌సైట్ తెలిపిన ప్రకారం సాహో కోసం అనుష్కకు శిక్షణ ఇవ్వడం కష్టంగా మారింది. ఆమె ఎక్కువ బరువు పెరుగడం వల్ల పాత్రకు సరిపోదని అనిపించింది. అనుష్క ప్రస్తుతం ఐదు నుంచి 8 కిలోల బరువు ఎక్కువగా ఉంది. లావెక్కడం కారణంగానే ఆమె పాత్రను వదులుకోవాల్సి వచ్చింది అని వెల్లడించింది.
బాహుబలి2 సినిమా ప్రమోషన్‌లో కూడా అనుష్క బరువు పెరగడం తెలిసిందే. అప్పడే చాలా మంది ఆమె బాడీపై తగిన శ్రద్ధ తీసుకోవడం లేదా అనే ప్రశ్నలు లేవనెత్తారు. బాహుబలి తర్వాత ఆమె పెళ్లి చేసుకోబోతున్నదనే వార్తలు కూడా జోరందుకున్నాయి. అందుకనే ఆమె శరీర బరువుపై అంతగా దృష్టిపెట్టడం లేదా అని అనుకొన్నారు.
కానీ తాజాగా బరువు కారణంగా సాహో నుంచి అనుష్కను తప్పించిన విషయంపై యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. అయితే త్వరలోనే మరో హీరోయిన్ పేరును ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటించడానికి కత్రినా కైఫ్, దిశా పటానీ, సోనమ్ కపూర్, శ్రద్ధాకపూర్, పూజా హెగ్డేను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కొత్త హీరోయిన్ ఎవరనే ఆసక్తి అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
