ప్రభాస్‌, గోపీచంద కాంబినేషన్‌లో ఇరవై ఏళ్ల క్రితం `వర్షం` వచ్చి పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ సెట్‌ కాబోతుందట. తాజాగా హింట్‌ ఇచ్చాడు గోపీచంద్‌.

ప్రభాస్‌, గోపీచంద్‌ టాలీవుడ్‌లో మంచి స్నేహితులు. `వర్షం` సినిమాకి ముందు నుంచి ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఇప్పటికీ అది కొనసాగుతుంది. అయితే ఈఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుండని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చాలా సార్లు చర్చకు వచ్చింది. దీనిపై అటు ప్రభాస్‌, ఇటు గోపీచంద్‌ స్పందించి మంచి కథ వస్తే చేయడానికి సిద్ధమే అన్నారు. కానీ వర్కౌట్‌ కాలేదు. 

ఇటీవల `సలార్‌` సినిమా సమయంలోనూ ఈ చర్చ జరిగింది. అసలు వరధరాజా మన్నార్‌గా చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్రలో గోపీచంద్‌ నటిస్తే సినిమా అదిరిపోయేదని, అది మరో స్థాయిలో ఉండేదనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. అభిమానులు అలాంటి సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోపీచంద్‌ అదిరిపోయే వార్త చెప్పాడు. ఇప్పుడు ఈ కాంబోలో సినిమా రాబోతుందనే హింట్‌ ఇచ్చి అభిమానుల్లో ఆశలు రేకెత్తించారు. 

ప్రస్తుతం గోపీచంద్‌ `భీమా` మూవీలో నటించారు. ఇది వచ్చే వారం విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోన్స్ లో భాగంగా గోపీచంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్‌తో సినిమాపై రియాక్ట్ అయ్యారు. యాంకర్‌ రవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ ఇద్దరం కలిసి నటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్లాన్ జరుగుతుందన్నారు. ఈ క్రమంలో నిర్మాత రాధామోహన్‌ రియాక్ట్ అవుతూ నిర్మాత కూడా ఫైనల్‌ అయ్యారని చెప్పడం విశేషం. 

దీంతో సీరియస్‌గానే ప్రభాస్‌, గోపీచంద్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని అర్థమవుతుంది. దీనికితోడు త్వరలోనే మా కాంబోలో సినిమాని ఆశించవచ్చని గోపీచంద్‌ చెప్పడం విశేషం. దీంతో ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానులు ఫుల్‌ ఖుషీ కావడమే కాదు, ఇది పూనకాలు తెప్పించబోతుందని చెప్పొచ్చు. ఇక హర్ష దర్శకత్వం వహించిన `భీమా` మూవీలో గోపీచంద్‌ సరసన మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ మార్చి 8న విడుదల కాబోతుంది. 

Read more: ఉదయ్‌ కిరణ్‌ మరణానికి కారకులు వాళ్లే.. జబర్దస్త్ కమెడియన్‌ సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం ప్రభాస్‌ `కల్కి2898ఏడీ`లో నటిస్తున్నాడు. మేలో ఈ మూవీ రాబోతుంది. ఆ తర్వాత `ది రాజాసాబ్‌` చిత్రంతో సందడి చేయబోతున్నారు. అలాగే `స్పిరిట్‌`, హను రాఘవపూడి మూవీ ఉంది. దీంతోపాటు `సలార్‌ 2` రాబోతుంది. గోపీచంద్‌ మూవీ ఓకే అయితే వచ్చే ఏడాది తర్వాతే ఈ మూవీ ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. కరెక్ట్ గా 20ఏళ్ల క్రితం ప్రభాస్‌ హీరోగా, గోపీచంద్‌ విలన్‌గా `వర్షం` సినిమా వచ్చింది. శోభన్‌ దర్శకత్వం వహించారు.ఈ మూవీ అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. గోపీచంద్‌కి తొలి బ్రేక్‌నిచ్చింది. 

Also read: `ఆపరేషన్‌ వాలెంటైన్‌` పై నెగటివ్‌ టాక్‌కి ఐదు కారణాలు.. వరుణ్‌ తేజ్‌ లాజిక్‌ ఎలా మిస్‌ అయ్యాడు?