`ఆపరేషన్ వాలెంటైన్` డిజాస్టర్ టాక్‌కి ఐదు కారణాలు.. వరుణ్ తేజ్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ గా `ఆపరేషన్ వాలెంటైన్` సినిమాతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన సినిమాకి నెగటివ్ టాక్ వస్తోంది. దానికి ఐదు కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్ కెరీర్ పరంగా సరైన విజయాలు లేవు. ఇటీవల ఆయనకు హిట్ వచ్చి చాలా రోజులవుతుంది. ఈ నేపథ్యంలో హిట్ చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఆయన ఓ సాహసం చేశాడు. తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి ఎయిర్‌ఫోర్స్ బేస్డ్ కంటెంట్‌తో సినిమా చేశాడు. ఉగ్రవాదులు పుల్వామా దాడి చేసి 40 మంది భారత జవాన్ల మరణానికి కారణమయ్యారు. దీనికి ఇండియా ఎలా ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో రూపొందిన `ఆపరేషన్ వాలెంటైన్` సినిమాలో నటించాడు. ఇది నేడు శుక్రవారం విడుదలైంది.
శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించగా, ఇందులో వరుణ్ తేజ్‌కి జోడీగా మిస్ వరల్డ్ మనుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించడం విశేషం. నేడు విడుదలైన ఈ మూవీకి బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన లభిస్తుంది. నిజానికి ప్రీమియర్స్ నుంచే సినిమాకి మిక్స్ డ్ టాక్ రావడం విశేషం. ఇంకా మార్నింగ్ షోస్ నుంచి అది నెగటివ్ టాక్ గా మారింది. సినిమాపై యూత్ ఆడియెన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. ఆశించిన రేంజ్‌లో లేదని, వీడియో గేమ్‌లా ఉందంటున్నారు. మరి నెగటివ్ టాక్‌కి ఐదు కారణాలేంటో ఓ సారి చూద్దాం.
`ఆపరేషన్ వాలెంటైన్` మూవీ తీవ్రవాదులు పుల్వామా దాడి చేసిన నేపథ్యంలో ఆ తర్వాత భారత ఎయిర్‌ఫోర్స్ వారిపై ప్రతీకారం తీర్చుకోవడమనే కథాంశంతో సినిమాని రూపొందించారు. ఓ రకంగా ఇందులో దేశభక్తి అంశాలను మేళవిస్తూ ఆడియెన్స్ లో ఆ స్ఫూర్తిని పెంచేలా, ఆ ఎమోషన్ ని ఆడియెన్స్ కి చూపించే ప్రయత్నంలో ఈ మూవీని రూపొందించారు. మెయిన్‌గా ఇందులో పుల్వామా ఘటనల పెయిన్ క్యారీ చేయలేకపోయాడు, ఆ దాడుల ప్రభావాన్ని ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయారని జనరల్ ఆడియెన్స్ నుంచి వినిపించే కామెంట్.
సినిమా ఏదైనా అందులో చెప్పాలనుకున్న పాయింట్‌కి సంబంధించిన ఎమోషన్ చాలా ముఖ్యం. ఆ సోల్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతేనే సినిమాతో ట్రావెల్ అవుతుంది. అందులో ఇన్‌వాల్వ్ అవుతారు. ఆఎమోషన్‌తో జర్నీ చేస్తూ అందులోని భావోద్వేగాలను ఆడియెన్ కూడా ఫీలవుతారు. ఇందులో అదే మిస్ అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. భావోద్వేగాలను బలంగా చూపించలేకపోయారు. దీంతో గగతలాన చేసే యాక్షన్ వీడియో గేమ్‌లుగానే మారిపోయింది.
దేశ భక్తి రగిల్చే అంశాలు కూడా సినిమాలో లేవు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశంలో చేసే ప్రయాణం, ఎయిర్ బేస్‌లో ఏం జరుగుతుంది, ఎలా చూస్తారనే అంశాలను చూపించారు. కానీ ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఎపిసోడ్లు కూడా లేవు. ఇటీవల వచ్చిన `ఫైటర్` సినిమా రేంజ్‌లో కూడా ఆయా సీన్లు లేవని పెదవి విరుస్తున్నారు ఆడియెన్. అంతకు ముందు `జవాన్`, `పఠాన్`, `టైగర్ 3`లో అలాంటి ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. వాటిని తెలుగు ఆడియెన్స్ కూడా చేశారు. దీంతో వాటితో పోల్చినప్పుడు మన వారికి ఎక్కడం లేదట.
యాక్షన్ సీక్వెన్స్ కి బీజీఎం కూడా హైలైట్ చేసేలా లేదు. ఇటీవల యాక్షన్ సీన్లకి బీజీఎం మెయిన్‌గా నిలుస్తుంది. దానితో పోల్చితే ఇది చాలా తక్కువగానే ఉంది. అది కూడా ఆడియెన్స్ అంతగా గూస్ బంమ్స్ ఫీల్‌ని పొందలేకపోవడానికి కారణమని చెప్పొచ్చు. టెక్నీకల్‌గా కెమెరా వర్క్ బాగుంది. కానీ కొన్ని చోట్ల వీఎఫ్‌ఎక్స్ తేలిపోయాయి. ఫైటర్ జెట్లు వీడియో గేమ్‌లను తలపిస్తున్నాయి. క్లైమాక్స్ కూడా అంతగా కిక్ ఇచ్చేలా లేదంటున్నారు.
హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా క్లారిటీ లేదు. అసలు వాళ్లకి పెళ్లి అయిందా, కాలేదా? అనేది స్పష్టంగా చూపించలేకపోయారు. వాళ్ల రొమాన్స్ కూడా కన్విన్సింగ్‌గా లేదు. వాళ్ల సీన్లని కట్ చేయడం వల్ల ఆ స్పష్టత కొరవడి ఉంటుందనే భావన కలుగుతుంది. నవదీప్ పాత్రని సరిగా చూపించలేదు. ఆ ఘటనలో అసలేం జరిగిందనేది క్లారిటీ లేదు. మరోవైపు వరుణ్ తేజ్ పాత్రని మరింత బలంగా చూపించాల్సిందంటున్నారు. ఈ అంశాలపై దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఫోకస్ పెడితే బాగుండేది. కథలో డ్రామా లోపించడంతో ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారు. దీంతో సినిమా సోల్, ఎమోషన్స్ లేని సినిమాలా నిలిచిందన్నారు. ఏదేమైనా వరుణ్ తేజ్‌కి `ఆపరేషన్ వాలెంటైన్` హిట్ ఇవ్వడం కష్టమే అంటున్నారు. అయినా ఫస్ట్ డేతో ఏం చెప్పలేం, వీకెండ్ అయితే గానీ సినిమా రిజల్ట్ పై క్లారిటీ రానుంది.