ఫారెన్ ట్రిప్‌కి ప్రభాస్.. మారుతి, `స్పిరిట్` చిత్రాలనుంచి అదిరిపోయే అప్‌డేట్లు..
ప్రభాస్ ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్లు వచ్చాయి. మారుతి మూవీతోపాటు `స్పిరిట్` చిత్రాల అప్‌డేట్లు వైరల్ అవుతున్నాయి.

గ్లోబల్ స్టార్ ప్రభాస్.. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా తన ఇమేజ్‌ని, క్రేజ్‌ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. `బాహుబలి2` తర్వాత ఆయనకు వరుసగా మూడు పరాజయాలు పడ్డాయి. సినిమాలు ఫ్లాప్ అయినా `సాహో` మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. `రాధేశ్యామ్` 250కోట్లు వసూలు చేసింది. `ఆదిపురుష్` దాదాపు నాలుగు వందల కోట్లు చేసింది. అది తన ఇమేజ్‌కి, తన మార్కెట్‌కి అద్దం పడుతుంది. అదే సినిమా హిట్ అయితే బాక్సాఫీసు షేక్ అయ్యేది.
ప్రస్తుతం `సలార్` చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉండగా, వీఎఫ్‌ఎక్స్ వర్క్ డిలే కావడంతో వాయిదా వేశారు. నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మారుతి(సూపర్ డీలక్స్), `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. అందులో భాగంగా ఆయన ప్రజెంజ్ మారుతి మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇటీవలే ఓ ఫైట్ సీన్ కంప్లీట్ చేశాడు. తాజాగా ఆయన బ్రేక్ తీసుకుని విదేశాలకు వెళ్తున్నారు. దాదాపు పదిహేను రోజులపాటు ఆయన విదేశీ ట్రిప్ ఉంటుందట.
అయితే ప్రభాస్ ట్రీట్‌మెంట్‌కి వెళ్తున్నారా? లేక, రిలాక్సేషన్‌కి వెళ్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ గత కొంత కాలంగా మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. అందుకు తరచూ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆయన అమెరికా వెళ్తున్నారా? ఈ సారి కూడా అందులో భాగమేనా? వెకేషన్‌కా అనేది తెలియాలి. ఇక ఇప్పుడు అల్లూమీనియంలో మారుతి సినిమా చిత్రీకరణ జరుగుతుంది, ఇందులో ఇతర నటులపై ఉన్న సీన్లని చిత్రీకరిస్తున్నారట.
ఇదిలా ఉంటే తాజాగా `సలార్`మూవీ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమాని వాయిదా వేస్తున్నట్టు టీమ్ వెల్లడించింది. ఈ సినిమా నవంబర్ 10 రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సీజీ వర్క్ కంప్లీట్ అయ్యే దాన్ని బట్టి రిలీజ్ డేట్ ఉంది. ఇంకాస్త ఆలస్యం అయితే డిసెంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు సంక్రాంతికి రావాల్సిన `కల్కి`(ప్రాజెక్ట్ కే) కూడా వాయిదా పడుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని సమ్మర్‌కి తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. ఈ రెండు సినిమాలు రెండు భాగాలుగా రాబోతుండటం విశేషం.
మరోవైపు ప్రభాస్ కొత్త సినిమా అప్‌డేట్ కూడా వచ్చింది. నెక్ట్స్ ఆయన `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` అనే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా ప్రకటించి రెండేళ్లు అవుతుంది. త్వరలోనే ఈ మూవీని ప్రారంభించనున్నారట. ప్రస్తుతం సందీప్‌రెడ్డి వంగా `యానిమల్` సినిమా చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా ఈ చిత్రం రూపొందుతుంది. డిసెంబర్‌లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అనంతరం వచ్చే ఏడాది ప్రారంభంలో `స్పిరిట్` చిత్రాన్ని ప్రారంభిస్తారట. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ వెల్లడించారు.