`ప్రాజెక్ట్ కే` నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్.. సూపర్ హీరోగా ఎంట్రీ.. కానీ ట్విస్ట్ అదే..
చాలా కాలంగా `ప్రాజెక్ట్ కే` ఎలా ఉండబోతుంది, అందులో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందనే అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తాయి. చాలా రోజులుగా ఆ సస్పెన్స్ కొనసాగింది. ఆ సస్పెన్స్ కి తెరదించింది యూనిట్. ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది.

`ప్రాజెక్ట్ కే` నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే ట్రీట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. చాలా కాలంగా `ప్రాజెక్ట్ కే` ఎలా ఉండబోతుంది, అందులో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందనే అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తాయి. చాలా రోజులుగా ఆ సస్పెన్స్ కొనసాగింది. తాజాగా ఆ సస్పెన్స్ కి తెరదించింది యూనిట్. ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పొచ్చు.
ఇందులో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తున్నారు. ఇనుప కవచాలు ధరించి భూమిపైకి దూకినట్టుగా ఆయన లుక్ ఉంది. ఇంటెన్స్ గా, ఆవేశంతో ప్రభాస్ కనిపిస్తుండటం విశేషం. ఇందులో `హీరో రైజ్ అవుతాడు, ఇప్పట్నుంచి గేమ్ మారుతుంది` అనే కాప్షన్ ఇచ్చారు. ఇది ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. అయితే ఈ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ జుట్టు మాత్రం కొత్తగా ఉంది. అది దేవుడి జుట్టుని తలపిస్తుంది. పైగా గెడ్డంతో ఉన్నారు ప్రభాస్. అయితే ప్రభాస్ ఈ సినిమాలో కృష్ణుడిగా, విష్ణువుగా కనిపిస్తారనే పూకార్లున్నాయి. టైటిల్‌లో `కే` అనేది లార్డ్ కృష్ణ అనే వార్తలు చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఆయన జుట్టు కూడా అదే తరహాలో ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. మరి విష్ణువు లుక్‌కి ఇది మరో రూపమా? ఆ పాత్రలో ఉన్న మిస్టరీ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ యోధుడిగా ప్రభాస్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాడు. ఆయన ఒకేసారి పైనుంచి దూకితే భూమి బద్దలైనట్టుగా వెనకాల శిథిలాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు, అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ఇక మరో రెండు రోజుల్లో `ప్రాజెక్ట్ కే`కి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కామిక్ కాన్ ఈవెంట్ లో సినిమా టైటిల్ని ప్రకటించబోతున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రభాస్, రానా, కమల్ హాసన్ అక్కడికి చేరుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోసిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సుమారు 500కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో గ్లోబల్ ఫిల్మ్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రెండు భాగాలుగా సినిమా రానుందని సమాచారం.