Project K First Look:అమీర్ పేట్ గ్రాఫిక్స్ తో మార్ఫ్ చేసి వదిలారా? ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ పై హెవీ ట్రోలింగ్!
ప్రభాస్ కి తాను చేసే చిత్రాలపై పరిశీలన ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రతిసారీ అభాసుపాలవుతున్నారు . ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ షురూ చేశారు.

ఇది ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా ఫస్ట్ లుక్ అంటే నమ్మడం కష్టమే. అమీర్ పేట్ గ్రాఫిక్స్ కంటే దారుణం. ఫ్యాన్ మేడ్ పోస్టర్ కంటే హీనం. నాగ్ అశ్విన్ ని ఏదో ఊహించుకున్నాం. ఇదేం లుక్ స్వామి అని కామెంట్స్ పేలుతున్నాయి. హడావుడిగా ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ వదిలిన టీమ్ భారీగా ట్రోల్ కి గురవుతున్నారు. ఏమాత్రం ఆకట్టుకోలేదని సినిమా ప్రేమికులు వాపోతున్నారు. చివరకు ఫ్యాన్స్ కూడా అసహనం బయటపెడుతున్నారు.
ఐరన్ మాన్ తరహా సూట్ ధరించిన ప్రభాస్ లాంగ్ హెయిర్ తో కనిపించారు. అది యాంగిల్ మిస్టేకో లేక నిజంగా మార్ఫ్ చేసి వదిలారో తెలియదు కానీ ప్రభాస్ బాడీకి తలకు సింక్ కాలేదు. ఉన్నవాటిలో ఒక బెస్ట్ లుక్ సెలెక్ట్ చేసుకోవాలన్న జాగ్రత్త కూడా ప్రాజెక్ట్ కే టీమ్ కి లేదు. ఫస్ట్ లుక్ చూసి అందరూ షాక్. అసలు ఫ్రాంక్ పోస్టర్ లా ఉందది. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా ముఖ్యం. ఆదిపురుష్ విషయంలో ఒకసారి దెబ్బతిన్నాక కూడా ప్రభాస్ మారింది లేదు.
ఒక్క పోస్టర్ ప్రాజెక్ట్ కే మీద అంచనాలు పాతాళానికి తొక్కేసింది. రేపు విడుదలయ్యే టీజర్ కూడా ఇలానే కార్టూన్ గ్రాఫిక్స్ ని తలపిస్తే ప్రాజెక్ట్ కే చిత్రానికి కనీస బిజినెస్ జరగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ మూడు చిత్రాలు చేశారు. సాహో విషయంలో ఎలాంటి విమర్శలు రాలేదు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ ప్రోమోల విషయంలో విఫలం చెందింది.
ఇక ఆదిపురుష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్ కి మించి ప్రాజెక్ట్ కే విషయంలో ఫ్యాన్స్ నిరాశపడేలా ఫస్ట్ లుక్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ప్రాజెక్ట్ కే తో తమ హీరో గ్లోబల్ బాక్సాఫీస్ షేక్ చేస్తాడనుకుంటే ఆదిలోనే హంసపాదు అన్నట్లు అయ్యింది
కాగా ప్రాజెక్ట్ కే శాన్ డియాగో కామిక్ కామ్ 2023లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ అంతర్జాతీయ సినిమా వేడుకలో పాల్గొన్న ఫస్ట్ ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే రికార్డులకు ఎక్కింది. శాన్ డియాగో కామిక్ కామ్ జులై 20 నుండి 23వరకు జరగనుంది. ప్రాజెక్ట్ కే తరపున హీరో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్ పాల్గొననున్నారని ప్రకటించారు.
నిన్ననే ప్రాజెక్ట్ కే యూనిట్ అమెరికాలో అడుగుపెట్టారు. ప్రభాస్, రానా, కమల్ హాసన్ అక్కడకు వెళ్లారు. శాన్ డియాగో కామిక్ కామ్ వేదికగా ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ టీజర్ విడుదల చేస్తున్నారు. జులై 20న టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం జులై 21న ఇండియన్ ఆడియన్స్ వీక్షించనున్నారు. ప్రాజెక్ట్ కే చిత్ర టైటిల్ ఇదే అంటూ కొన్ని ప్రచారంలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. ప్రాజెక్ట్ కే టీజర్ పై ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది.
దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అశ్వినీ దత్ ఈ చిత్ర నిర్మాత. కమల్ హాసన్ కీలక రోల్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ప్రాజెక్ట్ కే చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని సమాచారం. పార్ట్ 2 లో కమల్-ప్రభాస్ మధ్య ప్రధాన సంఘర్షణ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్, దిశా పటాని సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న విడుదల కానుంది.