ప్రభాస్ పై సిద్ధార్థ్ ట్వీట్.. ఫాన్స్ ఫైర్!

prabhas fans twitter attack on hero siddharth
Highlights

 సోమవారం నాడు '100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే' అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై సెటైరికల్ గా స్పందించాడు హీరో సిద్ధార్థ్. ''465 డివైస్ టు కింగ్ ప్రభాస్ నెక్స్ట్ బర్త్ డే ఆఫ్టర్ థిస్ వన్''.. ఓడే విధంగా కంటిన్యూ అవుతుంది

తెలుగులో హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీకు షిఫ్ట్ అయ్యాడు. తమిళ అబ్బాయి అయినప్పటికీ సిద్ధార్థ్ కు తెలుగులో మంచి క్రేజ్ దక్కింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఈ నటుడు ప్రభాస్ పై పెట్టిన కామెంట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

సాధారణంగా ఫాన్స్ తమ అభిమాన నటుడు పుట్టినరోజుకి ముందు, సినిమా విడుదలకు ముందు '10 డేస్ టు గో',' వన్ వీక్ టు గో' అంటూ పోస్ట్ లు పెడుతూ ట్రెండింగ్  చేస్తారు. అలానే సోమవారం నాడు '100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే' అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై సెటైరికల్ గా స్పందించాడు హీరో సిద్ధార్థ్. ''465 డివైస్ టు కింగ్ ప్రభాస్ నెక్స్ట్ బర్త్ డే ఆఫ్టర్ థిస్ వన్''.. ఓడే విధంగా కంటిన్యూ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ థ్రిల్ ఇస్తుంది కానీ చంపేస్తుంది. దయచేసి వాటిని కాస్త విచక్షణతో ఉపయోగించండి అంటూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

కొందరు రజినీకాంత్, అజిత్, విజయ్ ల మీద ఇలాంటి ట్వీట్ చేయగలవా..? వెంటనే ట్విట్టర్ నుండి వెళ్ళిపోతావ్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. మరొక అభిమాని ప్రభాస్, సిద్ధార్థ్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. 'ఎందుకు భయ్యా  నీ ఫ్రెండే  కదా..!' అని అడిగాడు. దానికి సిద్ధార్థ్ 'ఫ్రెండ్ కాబట్టే ఫ్రీడమ్ తీసుకుంటున్నా' అని రిప్లై చేశాడు. కొందరు సిద్ధార్థ్ పై ఇష్టమొచ్చినట్లుగా కామెంట్స్ చేస్తుంటే ఆయన కూడా వారికి గట్టిగా క్లాస్ తీసుకున్నాడు. 

 

 

loader