Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ 20 టైటిల్ ఫిక్స్? ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్స్

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20వ చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ జార్జియాలో జ‌రుపుకుంది.  రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నాయి

Prabhas  fans trending Radhe Shyam as the title
Author
Hyderabad, First Published Jun 20, 2020, 9:23 AM IST

ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా జల్ రాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న చిత్రానికి 'రాధేశ్యామ్' అనే టైటిల్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇది ప్రభాస్ కు 20వ చిత్రం. ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ, ట్రేడ్ అనలిస్ట్ శివ సత్యం, తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్  పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయారు. దాంతో ప్రభాస్ అభిమానులు 'రాధేశ్యామ్' హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ క్లాసికల్ డాన్సర్ గా కనిపించనుందని, ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉండేలా ఆమె గెటప్ ను డిజైన్ చేశారని వినపడుతోంది. ఈ విషయమై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

మరో ప్రక్క ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కూడా రెండు గెటప్స్ లో కనిపిస్తారట. రివేంజ్ తో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడట ప్రభాస్. అందుకే ఈ లాక్ డౌన్ లో స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే డైరక్టర్ కి చెప్పినట్లు..  రైటర్స్ చేత స్క్రిప్ట్ వర్క్ కూడా చేయించిన్నట్లు తెలుస్తోంది. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
 ఈ భారీ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఉన్నారు.  అయితే నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పటి నుంచి అనేది మాత్రం తెలియరాలేదు. అలాగే ఇప్పటికే  చాలా పెద్ద సినిమాలు అక్టోబర్ కు లేదా వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకుంటున్నాయి. ఎందుకంటే లాక్ డౌన్ ఎత్తేసినా వెంటనే సినిమాల్ని విడుదల చేసుకునే పరిస్దితి లేదు. ప్రేక్షకులు మునుపటిలా వచ్చే అవకాశం అయితే లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios