టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా పెద్ద ఫ్లాప్ అవుతుందని బాలీవుడ్ నటుడు, నిర్మాత కేఆర్కే కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేస్తూ వివాదాలను సృష్టించే కేఆర్కే ఇప్పుడు ప్రభాస్ సినిమా మీద నెగెటివ్ కామెంట్స్ చేశాడు. 

సాహో సినిమా పోస్టర్ చేస్తూ.. ఈ ఏడాది ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద డిజాస్టర్ అవుతుంది.. ఎందుకంటే సినిమా బడ్జెట్ 250 కోట్లు.. అంటూ రాసుకొచ్చాడు. ఈ సినిమా కచ్చితంగా కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు కేఆర్కే.

ఇది చూసిన ప్రభాస్ అభిమానులు కేఆర్కే ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రెండు రూపాయల క్రిటిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. 

మరికొందరు కేఆర్కే సరైన రివ్యూలు ఇవ్వలేడని, బాహుబలి 2 సినిమా విషయంలో కూడా నెగెటివ్ కామెంట్స్ చేశాడని, కానీ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసునని, ఇప్పుడు 'సాహో' విషయంలో కూడా అదే జరుగుతుందని అంటున్నారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇండియాలో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.