'సాహో' టీజర్ విడుదలైన తర్వాత 'వాళ్లు నా ఫ్యాన్స్ కాదు.. డైహార్డ్ ఫ్యాన్స్' అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగానే ప్రభాస్ కి  డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఒరిస్సాకు చెందిన ఓ ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ 486 రూబిక్ క్యూబ్స్‌తో 13 గంటల పాటు శ్రమించి ప్రభాస్ ముఖచిత్రం వచ్చేలా తయారు చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా డై హార్డ్ ఫ్యాన్ చేసిన పనికి అప్రిషియేట్ చేస్తున్నారు. ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్లైన్ లో టికెట్స్ పెట్టగానే నిమిషాల్లో అమ్ముడైపోతున్నాయి. దీన్ని బట్టి ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతోంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మించింది.