Radheshyam Event: రంగంలోకి దిగుతున్న ప్రభాస్.. ముంబయిలో ట్రైలర్ ఈవెంట్‌తో హంగామా షురూ
ఇది ఒక నిమిషం నిడివితో ఈ ట్రైలర్ ఉండబోతుందని, మార్చి 11న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కాబోతున్న `రాధేశ్యామ్`కిది కర్టెన్‌రైజర్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతుంది.
ప్రభాస్(Prabhas) నటించిన `రాధేశ్యామ్`(Radheshyam Movie) చిత్రం థర్డ్ కరోనా తర్వాత రాబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీ. ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా ట్రెండ్ క్రియేట్ చేసిన ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మార్చి 11న విడుదల కాబోతున్న ఈ సినిమా ఇండియా వైడ్‌గా మొత్తం థియేటర్లని ఆడియెన్స్ తో నింపేయబోతుంది. ఈ చిత్రం కోసం ఇతర భారీ సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు వెయిట్ చేస్తున్నాయి. ఓ రకంగా థియేటర్‌కి క్రౌడ్ పుల్లర్‌గా `రాధేశ్యామ్` నిలవబోతుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్. ఇప్పటికే వీడియో సాంగ్‌లతో అభిమానులను అలరిస్తుంది. మరోవైపు చిత్ర దర్శకుడు వరుసగా ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా Prabhas రంగంలోకి దిగబోతున్నారు. సినిమా విడుదలకు ఇంకా పది రోజులున్న నేపథ్యంలో నార్త్, సౌత్‌లోనూ ప్రమోషన్ షురూ చేస్తున్నారు. అందుకు ముంబాయిలో ఈవెంట్ వేదిక కాబోతుంది. రేపు బుధవారం(మార్చి 2) ముంబయిలో ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పటికే `రాధేశ్యామ్`కి సంబంధించిన భారీ ఈవెంట్‌లో హైదరాబాద్‌లో నిర్వహించారు. అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ సందర్బంగానే చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. అయితే జనవరి 14న సినిమా విడుదల చేయాలనే టార్గెట్‌తో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సినిమాని మరింతగా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది యూనిట్. అందులో భాగంగానే ఈ చిత్రం నుంచి మరో ట్రైలర్ ని విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. బుధవారం ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతుంది.
అయితే ఇది ఒక నిమిషం నిడివితో ఈ ట్రైలర్ ఉండబోతుందని, మార్చి 11న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కాబోతున్న `రాధేశ్యామ్`కిది కర్టెన్‌రైజర్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమా ఫ్లేవర్ ఏంటో క్లారిటీ ఇవ్వబోతుందట ఈ ట్రైలర్. ముంబయిలో మీడియా ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. ముంబయిలో వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత సౌత్‌లో ప్రమోట్ చేయబోతున్నారట. పక్కా ప్లానింగ్ ప్రకారం ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, కేరళాలోనూ ప్రమోషన్ చేయబోతున్నారట. బ్యాక్ టూ బ్యాక్ ఈ సినిమా సందడి ఉండబోతుందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇది ఓ రకంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సినిమాకి ఐదు భాషల్లో ఐదు బిగ్ స్టార్స్ వాయిస్ ఓవర్ అందించబోతున్నట్టు తెలిసింది. హిందీ వర్షెన్‌కి అమితాబ్ బచ్చన్, తెలుగుకి రాజమౌళి, మలయాళ వెర్షన్‌కి పృథ్వీరాజ్, కన్నడకి శివరాజ్‌కుమార్, తమిళంలో సత్యరాజ్ వాయిస్‌ని అందిస్తున్నారు. దీంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
`రాధేశ్యామ్` పీరియాడికల్‌లవ్ స్టోరీగా తెరకెక్కింది. ప్రేమకి, విధికి మధ్య ఫైటింగ్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఐరిష్ ఫామిస్ట్ కిరో జీవితం ఆధారంగా ఈ చిత్రంలోని ప్రభాస్ పాత్రని డిజైన్ చేసినట్టు చెప్పారు దర్శకుడు రాధాకృష్ణ. ఇది ఇండియన్ సినిమా గర్వపడేలా ఉంటుందన్నారు. మన హిందూ మ్యారేజెస్‌కి సంబంధించి సైంటిఫికల్‌గా నిరూపితమైన ఒక విషయాన్ని ఇందులో చర్చించబోతున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే.