Asianet News TeluguAsianet News Telugu

అనుష్కతో పెళ్లా... ఇప్పుడప్పుడే కాదంటున్న ప్రభాస్

  • అనుష్కతో పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్
  • ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసిన ప్రభాస్
  • తన కుటుంబం కూడా ఇప్పట్లో అలాంటి ఆలోచనేం చేయట్లేదన్న ప్రభాస్

 

prabhas ends marriage rumors with bahubali co star anushka shetty

బాహుబలి‌ చిత్రంతో టుసాడ్స్ మ్యూజియంలో సైతం చోటు సంపాదించటమే కాక దేశ వ్యాప్తంగా క్రేజీ హీరోగా... కలెక్షన్స్ వరకు ఫేమస్ అయిన యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకొంటాడనే వార్తలు అప్పట్లో జోరందుకున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అనుష్క‌తో పెళ్లి వార్తలు, ప్రభాస్‌కు పెళ్లి కూతురు కావాలి అని రానా చేసి ప్రకటన, తన పెళ్లిపై ప్రభాస్ వివరణ ఇచ్చాడు.

 

బాహుబలి రిలీజ్ తర్వాత అనుష్కతో ప్రభాస్‌ అఫైర్ జోరుగా సాగుతోందని.. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకొంటారని... అందుకే అనుష్క సినిమాలు అంగీకరించడం లేదని సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ ప్రచారమయ్యాయి. అయితే ఆ రూమర్లపై అనుష్క స్పందించి వాటిని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. తనపై ఇలాంటి వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటా అని హెచ్చరించింది.

 

ఇక తాజాగా అనుష్కతో పెళ్లి ఎఫైర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ... సినీ సెలబ్రిటీలకు అలాంటి ఇబ్బందులు తప్పవు. అలాంటి రూమర్లు రావడం చాలా సహజం. ఎవరైనా హీరో ఓ హీరోయిన్‌తో వరుసగా రెండు, మూడు సినిమాలు చేస్తే ఇలాంటి గాసిప్స్ రావడం చాలా సహజం అని ప్రభాస్ అన్నారు. మొదట్లో తనపై ఇలాంటి రూమర్లు వస్తే చాలా బాధపడే వాడినన్న ప్రభాస్... ఇప్పుడు రూమర్స్ సర్వసాధారణమై పోయాయని అన్నాడు. వాటిని పట్టించుకోవడం మానేశానన్నారు.

 

ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని వస్తున్న వార్తలపైనా ప్రభాస్ స్పందించారు. ఇప్పట్లో పెళ్లి ఆలోచనలు ఇటు తనకు, అటు ఇంట్లో వాళ్లకు కూడా లేవన్నాడు. మహిళా అభిమానులు నా పెళ్లి గురించి ఆందోళన చెందొద్దని భరోసా ఇస్తున్నాడు. ఇంతలా అభిమానాన్ని కురిపిస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాను. సాహో చిత్రం తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని ప్రభాస్ పేర్కొన్నాడు.

 

బాహుబలి షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ప్రభాస్‌కు పెళ్లి కూతురు కావాలి అని సోషల్ మీడియాలో రానా దగ్గుబాటి ఇచ్చిన ప్రకటన గురించి ప్రభాస్ చాలా తేలికగా తీసుకొన్నారు. రానా క్రియేటివిటికి ఆ యాడ్ అద్దం పట్టింది. నేను పెళ్లి చేసుకోబోతున్నానని రానాకు చెప్పలేదు. అతడు కూడా అలా చెప్పలేదు. ఏదో సరదాగా రానా అది చేశాడని చెప్పాడు. ప్రస్థుతం పలు భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సాహో చిత్రంపైనే ప్రభాస్ దృష్టిపెట్టానని స్పష్టం చేశాడు ప్రభాస్.

Follow Us:
Download App:
  • android
  • ios