బాహుబలి సినిమాలో ప్రభాస్ కోసం డూప్ ఆర్టిస్ట్ బాహుబలి సినిమాలో ని కీలక యుద్ధ సన్నివేశాల్లో  నటించింది డూప్  ప్రభాస్ డూప్ గా నటించింది రాజ్ కిరణ్

సినిమా షూటింగుల్లో రిస్కీ షాట్ తీయాలంటే మన హీరోలు డూపును పెట్టుకుని చేయిస్తుండటం సహజమే. అయితే బాహుబలి లాంటి భారీ బజట్ చిత్రంలో హీరోగా నటించిన బాహుబలి ప్రభాస్ కు కూడా కొన్ని సన్నివేశాల్లో డూపును పెట్టక తప్పలేదట రాజమౌళికి. కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నప్పుడు బాహుబలి2లో కూడా ప్రభాస్ చేయలేని కొన్ని ప్రమాదకరమైన స్టంట్ లను కూడా డూప్ తో చేయించారు. ఇంతకీ ఆ డుప్ ఎవరంటే ప్రభాస్ డూప్ కు వెనక ఉన్న ఆర్టిస్ట్ పేరు కిరణ్ రాజ్.

అచ్చం ప్రభాస్ మాదిరిగానే హైట్, వెయిట్, హెయిర్,ఫిజిక్ ఉన్న కిరణ్ రాజ్ బాహుబలి సినిమాలో ఎంతో కీలకంగా మారాడు. యంగ్ రెబల్ స్టార్ గడ్డం, మీసాలు పెంచితే అతడు కూడా గడ్డం పెంచాడు. బాహుబలి చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రభాస్ ఎలా డ్రెసింగ్ చేసుకుంటాడో, ఎలా మేకప్ చేసుకుంటాడో అలాగే ఇతగాడు కూడా మేకప్ వేసుకున్నాడు.అయితే నువ్వు ప్రభాస్ లా ఉంటావని అందరు అన్నారట. ఈమాటలే కిరణ్ రాజ్ మనసులో నాటుకున్నాయి. అంతే ప్రభాస్ ను క్షుణ్ణంగా పరిశీలించిన ఇతగాడు అచ్చం ప్రభాస్ లాగే మారిపోయాడు. ఆహార్యం, నటన అన్నీ డార్లింగ్ లా ఒణికిపుచ్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం బాహుబలి సినిమాలో ప్రభాస్ కు డూప్ కావాలి. కిరణ్ రాజ్ ను ఎంపిక చేశాడు రాజమౌళి . తన అదృష్టానికి మురిసిపోయిన కిరణ్ ప్రభాస్ వెంటే ఉన్నాడు. ప్రభాస్ లా మేకప్ వేసుకోవడం, ప్రభాస్ లానే క్యాస్టుమ్స్ ధరించడం చేశాడు. డ్యూయల్ రోల్ ఉన్న ప్రభాస్ శివుడు, బాహుబలి క్యారక్టర్స్. ఈ రెండు సన్నివేశాలకు సంబంధించిన యుద్ధ సన్నివేశాల్ని లాంగ్ షాట్ లో ప్రభాస్ క్యారక్టర్ లో కిరణ్ రాజ్ నటించేవాడు. అలా ప్రభాస్ కు కిరణ్ చాలా దగ్గరయ్యాడు.

అయితే యుద్ధ సన్నివేశాల్ని ప్రభాస్ కు బదులు కిరణ్ రాజ్ చేసేవాడనే సోషల్ మీడియా అప్ డేట్స్ ను బాహుబలి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని బాహుబలి టీంలో పనిచేస్తున్న విజువల్ ఎఫెక్ట్ టీం ధృవీకరించింది. బాహుబలి డూప్ కిరణ్ రాజేనని టీమ్ కూడా స్పష్టం చేసినట్టు సమాచారం.