కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా "సలార్".


ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సలార్‌’. విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 28న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ఆల్రెడీ ప్రకటించింది. దీంతో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని ‘సలార్‌’ టీమ్‌ షూటింగ్‌ షెడ్యూల్స్‌ని పక్కాగా ప్లాన్‌ చేసి, గ్యాప్‌ రాకుండా చూసుకుంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఏమిటనే విషయమై సినీ సర్కిల్స్ లో చర్చగా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు...ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఫుల్ లెంగ్త్ నెగిటివ్ గా ఉంటుందంటున్నారు. కేజీఎఫ్ లో రాకీ భాయ్ పాత్రలాగ ఈ పాత్ర కూడా ఎలాంటి రూల్స్ ,రెగ్యులేషన్స్ లేకుండా ప్రవర్తించటం, చట్టం, న్యాయ వ్యవస్దను లెక్కచేయకపోవటం, ప్రభుత్వాన్ని పట్టించుకోకపోవటం వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు. ఓ బాధాకరమైన గతం ఉంటుందన, అది సినిమా లో అండర్ కరెంట్ గా ఈ పాత్రను మోటివేట్ చేస్తుందని చెప్తున్నారు. అయితే రాకీ భాయ్ గా యష్ ని చూపటానికి ఏ సమస్యా లేదు. ఎందుకంటే అప్పటికతను అంత స్టార్ కాదు. కానీ ప్రభాస్ ఇప్పటికే పెద్ద స్టార్ దాంతో ఇలా నెగిటివ్ పాత్రలో ప్రభాస్ ని చూపటం అంత ఈజీ కాదంటున్నారు. ఇది ప్రశాంత్ నీల్ కు పెద్ద టాస్క్ అని చెప్పాలి. 

కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా సలార్. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.
సలార్ సినిమాను కూడా కేజీఎఫ్‌ నిర్మాతలే నిర్మిస్తుండగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటప్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై ప్రభాస్ కూడా సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. అయితే సలార్ సింగిల్ మూవీనా... టూ పార్ట్స్‌గా వస్తుందా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే నెటిజన్స్ మాత్రం సలార్ మూవీ టూ పార్ట్స్‌గా వస్తుందని గట్టిగా చెబుతున్నారు. 

ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడట. గతంలో ప్రభాస్ బాహుబలి సినిమాలో కూడా తండ్రి, కుమారుడిగా నటించాడు. కానీ ఏ సీన్‌లోనూ కలిసి కనిపించరు. కానీ సలార్ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో ప్రభాస్ కలిసి కనిపిస్తారనే మాట వినిపిస్తోంది. సలార్ ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ సలార్‌గా కనిపించగా.. ఇక సలార్ సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ దేవాగా కనిపిస్తాడట. అయితే సలార్ టీమ్ మాత్రం దేవ క్యారెక్టర్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. సలార్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో దేవా క్యారెక్టర్‌ను పరిచయం చేస్తారనే మాట టాలీవుడ్‌లో వినిపిస్తోంది. 

దేవా పాత్ర సలార్ వన్ లాస్ట్‌లో రివీల్ చేస్తే.. పార్ట్ -2 పై అంచనాలు పెరుగుతాయనేది మేకర్స్ ప్లాన్. అయితే సలార్ వన్, టూ షూటింగ్ ఒకేసారి కంప్లీట్ చేస్తారా.. సలార్ రిలీజ్ తర్వాత పార్ట్ -2 షూటింగ్ స్టార్ట్ చేస్తారా అనేది తెలియాల్సి వుంది. సలార్ మూవీ రెండు పార్టులా లేక సింగిల్ మూవీగా వస్తుందా అనే విషయం ఉగాది రోజు సలార్ టీమ్ అప్డేట్‌తో క్లారిటీ కానుంది.

ఇక బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్‌ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ ప్రభాస్ మూవీ లైనప్ చూసి హ్యాపీ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మరే పాన్ ఇండియా స్టార్ దగ్గర లేవు. సెట్స్ మీద నాలుగు సినిమాలు ఉంటే.. మరో రెండు సినిమాలు లైన్‌లో వున్నాయి. జగపతిబాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్‌.