Project K: ప్రభాస్‌-దీపికా పదుకొనె వరల్డ్ బిగ్గెస్ట్ మూవీ స్టార్ట్.. ఫస్ట్ షాట్ చూశారా?

`ప్రాజెక్ట్ కే` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ని శనివారం ప్రారంభించారు. 

prabhas deepika padukone project k movie shooting start here the first shot

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) మరో బిగ్గెస్ట్ మూవీని ప్రారంభించారు. ప్రస్తుతం మూడు పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్‌ ఇప్పుడు మరో బిగ్గెస్ట్ పాన్‌ ఇండియా సినిమాని శనివారం ప్రారంభించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో Prabhas ఓ సినిమా చేస్తున్నారు. `ప్రాజెక్ట్ కే`(Project K) వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ని శనివారం ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే సినిమా ప్రారంభమైందనే విషయాన్ని తెలియజేస్తూ యూనిట్‌ చిన్న క్లిప్‌ని పంచుకుంది. 

Project K దర్శకుడు రోల్‌ కెమెరా.. స్టార్ట్ అనగా, ప్రభాస్‌ తన చేయి ఇవ్వగా, కింద నుంచి దీపికా పదుకొనె చేయి అందించడం విశేషం. ఇది సినిమా షూటింగ్‌లోని ఫస్ట్ షాట్‌ అని తెలుస్తుంది. ఈ సందర్భంగా సినిమాని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ వీడియో క్లిప్‌ని పంచుకుంటూ, `ఇండియన్‌ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌ ప్రభాస్‌, దీపికా పదుకొనె కలిసి వరల్డ్ బిగ్గెస్ట్ కెమెరా ముందుకు.. `అని చెబుతూ ఈ వీడియోని పంచుకున్నారు. 

ఈ సినిమా షూటింగ్‌ కోసం వాడుతున్న కెమెరా కూడా ప్రత్యేకత చాటుకుందని, తెలుస్తుంది. ఏఆర్‌ఆర్‌ఐ రెంటల్‌ తయారు చేసే అలెక్సా 65 కెమెరాని వాడుతున్నారు. ఇది అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కెమెరా. బిగ్గెస్ట్ కాన్వాస్‌ని ఆవిష్కరించేలా ఉంటుందీ కెమెరా. ఈ సినిమాని వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు, దీన్ని ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో నిర్మిస్తున్న గతంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెలిపిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా సినిమా పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇది జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. దీంతోపాటు `సలార్‌`, `ఆదిపురుష్‌` చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్‌. ఇందులో `ఆదిపురుష్‌` ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నారు. `ఆదిపురుష్‌` చిత్రానికి బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి సనన్‌ సీత పాత్రలో, సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి పాత్రని పోషిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న `సలార్‌`లో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది.

also read: RRR Movie: నాపై చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు.. వైరల్ అవుతున్న అలియా భట్ కామెంట్స్
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios