Asianet News TeluguAsianet News Telugu

కటౌట్‌లో రికార్డు క్రియేట్‌ చేసిన ప్రభాస్‌.. ఫ్యాన్స్ హంగామా నెక్ట్స్ లెవల్‌..

దసరా పండుగ సందర్భంగా ప్రభాస్‌ పుట్టిన రోజు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆయన కటౌట్‌ ఆవిష్కరించేందుకు డార్లింగ్‌ ఫ్యాన్స్ హైదరాబాద్‌లో భారీగా ర్యాలీ నిర్వహించారు. 

prabhas cut out create new record birthday hungama next level arj
Author
First Published Oct 23, 2023, 1:25 PM IST

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. ఈ పుట్టిన రోజు చాలా స్పెషల్‌ అని చెప్పొచ్చు. ఆయనకు సంబంధించిన కటౌట్‌ని నెలకొల్పారు ఫ్యాన్స్. కుకట్‌పల్లిలోని కతైలాపూర్‌ గ్రౌండ్‌లో భారీగా డార్లింగ్‌ కటౌట్‌ని నిర్మించారు. `సలార్‌` సినిమాలోని రెండు కత్తుల పట్టుకుని ప్రత్యర్థులను అంతం చేసే ఫోటోని కటౌట్‌గా నిర్మించారు. అయితే దీని హైట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇది 230 ఫీట్ల హైట్ తో నిర్మించడం విశేషం. ఇప్పటి వరకు మరే హీరో కటౌట్‌ లు కూడా ఇంతటి హైట్‌తో నిర్మించలేదు. ఈ విషయంలో ప్రభాస్ రికార్డు సృష్టించారని చెప్పొచ్చు. దీంతో ఈ బర్త్ డే ని చాలా స్పెషల్‌గా మార్చారు ఫ్యాన్స్.

అయితే నేడు సోమవారం దసరా పండుగ సందర్భంగా ప్రభాస్‌ పుట్టిన రోజు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ కటౌట్‌ ఆవిష్కరించేందుకు ఆయన అభిమానులు హైదరాబాద్‌లో భారీగా ర్యాలీ నిర్వహించారు. డార్లింగ్‌ ఫోటోతో ముద్రించిన వైట్ టీషర్ట్ లు ధరించి ప్రభాస్‌ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కటౌట్‌ వద్ద సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రభాస్‌ ఫ్యాన్స్ అసోసియేషన్లు పాల్గొని సెలబ్రేట్‌ చేశారు. ఆటపాటలు, డాన్సులు, ఇతర కల్చరల్‌ ఈవెంట్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ అభిమాన సంఘాల నాయకులు మాట్లాడుతూ, తమ అభిమానాన్ని, ప్రభాస్‌ గొప్పతనాన్ని ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్‌ యూకేలో ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడే ఆయన తన బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన యూకే వెళ్లారట. బర్త్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆయన ఇండియాకి తిరిగి రానున్నారు. అనంతరం మారుతితో రూపొందిస్తున్న సినిమాలో, అలాగే `కల్కి`(ప్రాజెక్ట్ కే) చిత్రంలో నటించబోతున్నారు. దీనికితోడు `సలార్‌` కొంత ప్యాచ్‌ వర్క్ షూట్‌ జరగనుందని తెలుస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. 

`బాహుబలి` తర్వాత డార్లింగ్‌కి సరైన హిట్‌ పడలేదు. అందరు ఆశలన్నీ `సలార్‌`పైనే పెట్టుకున్నారు. ప్రభాస్‌ కొడితే బాక్సాఫీసు ఎలా షేక్‌ అవుతుందో చూడాలనుకుంటున్నారు. మరి `సలార్‌` ఆ కోరిక తీరుస్తుందా అనేది చూడాలి. ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్‌ కథానాయకగా నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios