యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కొద్దిసేపటి క్రితమే సాహో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. 

ప్రభాస్, శ్రద్దా కపూర్ తో పాటు సాహో చిత్ర యూనిట్ నేడు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభాస్ క్రేజ్ చూసి ముంబై మీడియా ఆశ్చర్యపోయింది. ఓ మీడియా ప్రతినిధి అయితే.. మీ క్రేజ్ బాలీవుడ్ ఖాన్స్ నే తలదన్నేలా ఉందని కామెంట్ చేశాడు. దీనికి ప్రభాస్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. సల్మాన్, షారుఖ్, అమిర్ చిత్రాలని మించే స్థాయిలో సాహో హిందీలో విడుదల కాబోతోంది. 

మరో మీడియా ప్రతినిధి అయితే మీకు హిందీలో ఫ్యాన్స్ కాదు.. డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని వ్యాఖ్యానించాడు. ఇక ట్రయిలర్ లాంచ్ కార్యక్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. సాహో చిత్రం కోసం 2 ఏళ్ల సమయం ఎందుకు కేటాయించారు అని మీడియా ప్రశ్నించగా.. బాహుబలికి నాలుగేళ్లు కేటాయించా.. దీనికి 2 ఏళ్ల సమయం పెద్ద విషయం కాదు అని ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. 

సాహో చిత్రంలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబందించిన ట్రైనింగ్, షూటింగ్ కి ఎక్కువ సమయం పట్టింది. అందుకే ఈ చిత్రం పూర్తి కావడానికి రెండేళ్ల సమయం పట్టిందని ప్రభాస్ వివరణ ఇచ్చాడు. ఆకాశాన్ని తాకే అంచనాలతో సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.