దాదాపు వారం రోజుల పాటు జరిగిన సలార్ మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు సమాచారం అందుతుంది. నేటితో సలార్ టీమ్ గోదావరి ఖని ఏరియా నుండి ప్యాక్ అప్ చెప్పారట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోరు మాములుగా లేదు. నాలుగు సినిమాలు చేస్తున్న ఆయన మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు. రాధే శ్యామ్ తో పాటు, సలార్, ఆదిపురుష్ చిత్రాల షూటింగ్స్ మొదలయ్యాయి. ఆదిపురుష్ మూవీ షూటింగ్ ముంబైలో ప్రత్యేకమైన సెట్స్ లో మొదలైంది. కాగా సలార్ షూటింగ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలంగాణా రాష్ట్రంలోని గోదావరి ఖని మైనింగ్ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్నారు.
హీరోయిన్ శృతి హాసన్ తో పాటు ప్రభాస్ ఈ షెడ్యూల్ నందు పాల్గొనడం జరిగింది. కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. దాదాపు వారం రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు సమాచారం అందుతుంది. నేటితో సలార్ టీమ్ గోదావరి ఖని ఏరియా నుండి ప్యాక్ అప్ చెప్పారట. సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుందని సమాచారం. కాంబినేషన్ రీత్యా సలార్ మూవీపై భారీ అంచనాలున్నాయి.
భారీ బడ్జెట్ తో కెజిఎఫ్ నిర్మాతలు సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సలార్ విడుదల కానుందని సమాచారం. ఇక రాధే శ్యామ్ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో వాలెంటైన్స్ డే నాడు విడుదల కానుంది. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ మూవీపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది.
