రిలీజ్ కు ముందు ఈ సినిమా గురించి ఎవరు చెప్పిన షిప్ , ట్రైన్ ఎపిసోడ్లు గురించే చెప్పారు. రాజమౌళి కూడా ఆ రెండు ఎపిసోడ్లు సినిమాకి కీలకమని అభిప్రాయపడ్డారు. రాధేశ్యామ్ యూనిట్ అంత ఆసక్తిగా చెబుతున్న ఆ ఎపిసోడ్లలలో ట్రైన్ ఎపిసోడ్ బాగా  పండింది కానీ షిప్ ఎపిసోడ్ మాత్రం వర్కవుట్ కాలేదు. ఏదో గ్రాఫిక్స్ లో అలా వచ్చి వెళ్లిపోయినట్లు అనిపించింది.


మొన్న శుక్రవారం ప్రభాస్ పాన్ ఇండియా సినిమా 'రాధేశ్యామ్' థియేటర్ లోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే రాజమౌళి లాంటి ప్రముఖులు చూశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా రాజమౌళి, ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈ ఇంటర్వ్యూలో చాలా ఇంట్రస్టింగ్ అంశాలు పంచుకున్నారు. సినిమాలోని కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ గురించి ప్రేక్షకులకు ఆసక్తి పెరిగేలా మాట్లాడారు. ఇదే సందర్భంలో రాధే శ్యామ్ స్టోరీ లైన్ పై కూడా చర్చ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ తర్వాత ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 'రాధేశ్యామ్' స్టోరీ గురించి రాజమౌళి మాట్లాడుతూ... ''రాధేశ్యామ్ ఒక ఎమోషనల్ లైన్. చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అయితే అదే లైన్ ని చిన్న సినిమాగా కూడా తీయొచ్చు. మరి ఇంత పెద్ద సినిమాగా చేయాలని ఎక్కడ అనిపించింది?'' అని ప్రభాస్ ని ప్రశ్నించారు రాజమౌళి.

ఈ ప్రశ్నకు ప్రభాస్ కూడా చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. '' నిజమే రాధేశ్యామ్ కథని రెండు కోట్లలో కూడా తీయొచ్చు. అయితే దర్శకుడు ఆ కథ చెప్పిన తర్వాత గ్రాండ్ గా వుంటే బావుంటుందని అనిపించింది. షిప్, ట్రైన్ ఎపిసోడ్లు రిచ్ గా చేయాలనీ భావించాం. నిర్మాతలు కూడా కుదిరారు. అలా రాధే శ్యామ్ పెద్ద సినిమా అయ్యింది'' అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ప్రబాస్ అన్నట్లుగా రెండు కోట్లులో ఈ సినిమా చిన్న హీరోతో తీస్తే వర్కవుట్ అయ్యేదని అభిప్రాయపడుతూ చాలా మంది పోస్ట్ లు పెడుతున్నారు. విజువల్స్ సరపడ విషయం ఉన్న కథ లేదే అంటున్నారు.

రిలీజ్ కు ముందు ఈ సినిమా గురించి ఎవరు చెప్పిన షిప్ , ట్రైన్ ఎపిసోడ్లు గురించే చెప్పారు. రాజమౌళి కూడా ఆ రెండు ఎపిసోడ్లు సినిమాకి కీలకమని అభిప్రాయపడ్డారు. రాధేశ్యామ్ యూనిట్ అంత ఆసక్తిగా చెబుతున్న ఆ ఎపిసోడ్లలలో ట్రైన్ ఎపిసోడ్ బాగా పండింది కానీ షిప్ ఎపిసోడ్ మాత్రం వర్కవుట్ కాలేదు. ఏదో గ్రాఫిక్స్ లో అలా వచ్చి వెళ్లిపోయినట్లు అనిపించింది.

పిరియాడిక్ లవ్ స్టోరీ.. సినిమా గ్రాండియర్ లుక్ ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పిస్తోంది. కొత్త ప్రభాస్ ని చూసుకునే అరుదైన అవకాశం ప్రేక్షకాభిమానులకు ఇప్పుడొచ్చింది. సినిమాపై కాస్త నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ పోటీగా సినిమాలు లేవు కాబట్టి ఆ ప్రభావం అంతగా కనిపించవు అంటున్నారు. మరో ప్రక్క సినిమాలో పూజాహెగ్డే గ్లామరస్ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి `జిల్` ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.