ఎక్కడికెళ్లినా ప్రభాస్ ని అనుష్కకు సంబందించిన రూమర్ ఎదురవుతూనే ఉంది. ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలుమార్లు ఇద్దరు ఆ రూమర్స్ చెక్ పెట్టె విధంగా డైరెక్ట్ గా తాము మంచి ఫ్రెండ్స్ అన్నట్లు క్లారిటీ ఇచ్చారు. 

అయినా కూడా రాసేవాళ్ళు రాస్తూనే ఉండడంతో ప్రభాస్ పట్టించుకోవడం మానేశాడు. ఇక రూమర్స్ కు బూస్ట్ ఇచ్చే బాలీవుడ్ మీడియాలో మరోసారి ఈ ప్రస్తావన వైరల్ అవ్వకుండా ప్రభాస్ అనుష్క గురించి మాట్లాడనున్నాడు. కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ లో ప్రభాస్ తో పాటు రానా - రాజమౌళి పాల్గొన్న సంగతి తెలిసిందే. 

ఈ షోలో అనేక విషయాల గురించి ప్రస్తావించిన ప్రభాస్ అనుష్క గురించి కూడా కొన్ని విషయాలను చెప్పాడట. ఆ విశేషాలు ఏమిటనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలియనుంది. అయితే ప్రభాస్ రూమర్స్ ఎంతవరకు చెక్ పెడతాడు అనేది చూడాలి. ఇక ప్రభాస్ నటిస్తోన్న సాహు రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చెయ్యాలని యువీ క్రియేషన్స్ సన్నాహకాలు చేస్తోంది.