Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌భాస్‌ ‘గుహ’ ఆలోచన.. అప్పటినుంచే మొదలైందట

హైద‌రాబాద్ శివార్ల‌లో దాదాపు 5 ఎక‌రాల విస్తీర్ణంలో ఓ ఫామ్ హౌస్ కొని దాన్ని మేడరన్ గా చేస్తున్నారట ప్ర‌భాస్‌. ఇప్పటికే  ఆ ఫామ్ హౌస్‌ని ఆధునీక‌రించే పనులు మొదలయ్యాయి 

Prabhas Building A Cave-Like Farmhouse At City Outskirts!
Author
First Published Jun 1, 2023, 3:13 PM IST

మిగతా స్టార్ హీరోల్లా... ప్రభాస్ తన డబ్బుని ఏ బిజినెస్ లోనే ఇన్విస్ట్ చేయరు. రాజభోగం టైప్ లో అనుభవించటానికే ఇష్టపడతారు అని చెప్తారు. అందుకు తగ్గట్లుగానే ఆయన తను సంపాదించిన సొమ్ముని ఫామ్ హౌస్ లపైనే పెడుతున్నారు. అయితే ఆయన తాజాగా గుహ లాంటి ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారని వార్తలువస్తున్నాయి.  రీసెంట్ గా  హైద‌రాబాద్ శివార్ల‌లో దాదాపు 5 ఎక‌రాల విస్తీర్ణంలో ఓ ఫామ్ హౌస్ కొని దాన్ని మేడరన్ గా చేస్తున్నారట ప్ర‌భాస్‌. ఇప్పటికే  ఆ ఫామ్ హౌస్‌ని ఆధునీక‌రించే పనులు మొదలయ్యాయి అని సమాచారం.  రెగ్యులర్ గా ఉండే అన్ని ఫామ్ హౌస్ లు లాగా కాకుండా .... త‌న ఫామ్ హౌస్‌లో ఓ చిన్న‌పాటి గుహ‌లాంటిది నిర్మించుకొంటున్నాడ‌ని సమాచారం. 

అందుకోసం కొంతమంది నిపుణులు ఇతర దేశాలు నుంచి వచ్చి మరీ  ప‌ని చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ  గుహ.. కొండ  ని తవ్వి కడుతున్నట్లుగా ఉంటుందిట. ఆదిపురుష్ సెట్స్ చూసినప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చిందని చెప్తున్నారు. అప్పటి వాతావరణం లా తనకు ఉంటే బాగుంటుందనే కోరిక ఈ గుహ పని దాకా వచ్చిందని వినికిడి. అందుకే ఎంత డబ్బు ఖర్చైనా గుహను మాత్రం గొప్పగా కట్టాలనుకుంటున్నారట.

ఇక ఈ ఫామ్ హౌస్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తమని ప్రభాస్ ఎప్పుడు పిలుస్తాడో అని ఆయన సన్నిహితులు , స్నేహితులు ఎదురుచూస్తున్నారట. ఇక  ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్‌' విడుదలకు సిద్ధమవుతోంది. బిజినెస్ లెక్కలు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో భారీస్థాయిలో వ్యాపారం జరుగుతోంది. గతంలో ఏ చిత్రం విడుదల కానటువంటి రీతిలో అత్యధిక స్క్రీన్లపై ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. రామాయణ గాథను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకుడు.
 
ఇక ప్రభాస్ ...ఈ సినిమా నిమిత్తం డబ్బులుగా కాకుండా వాటా రూపంలో  రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. నిర్మాతలు ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల హక్కులు ప్రభాస్ కు ఇచ్చేశారని, ప్రభాస్ వాటిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఆదిపురుష్ సినిమాకు ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.170 కోట్లు. ఈ సంస్థ నుంచి వచ్చిన మొత్తంలో దాదాపు 100 కోట్లరూపాయలు యూవీ క్రియేషన్స్ కు ఇచ్చారని తెలిసింది. కొన్నిరోజులుగా ఈ సంస్థకు పాత అప్పులు ఉండటంతో వాటిని సంస్థ తీర్చేసింది. దాంతో ప్రభాస్ ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios