ప్రభాస్ బౌన్స్ బ్యాక్.. `సలార్`, `ప్రాజెక్ట్ కే` షూటింగ్ అప్డేట్స్.. ఫ్యాన్స్ కి పండగే!
ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ అప్‌డేట్లు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాక్ టూ బ్యాక్ డార్లింగ్ `ప్రాజెక్ట్ కే`, `సలార్ ` చిత్రాల షూటింగ్స్ లో పాల్గొనబోతున్నారు.

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి `ఆదిపురుష్` చిత్రీకరణ పూర్తి చేసుకుని వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ జరుపుకుంటోంది. మరోవైపు `సలార్`, `ప్రాజెక్ట్ కే` చిత్రీకరణ దశలో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ప్రభాస్ షూటింగ్‌లో సరిగా పాల్గొనడం లేదు. పెదనాన్న కృష్ణంరాజు మరణంతో కొంత గ్యాప్ వచ్చింది. అయినా సైలెంట్‌గా వర్క్ చేశారు. కానీ ఆయన్ని మోకాలు గాయం వెంటాడుతుంది. దానికి ట్రీట్‌మెంట్ కోసం ఆయన తరచూ అమెరికా వెళ్లి వస్తున్నారు.
లేటెస్ట్ గా ఆయన మరోసారి ట్రీట్‌మెంట్‌కి వెళ్లి వచ్చారు. నిన్న(మంగళవారం)నే ఆయన హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. అయితే గాయం పూర్తిగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన రెగ్యూలర్‌గా నడుచుకుంటూ వచ్చారు. అంతకు ముందు కాలు గాయం తాలుకూ పెయిన్‌తో ఆయన నడుస్తున్నట్టుగా అనిపించింది. కానీ ఈ సారి సాఫీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ అన్నకి కాలు సెట్ అయ్యింది. క్యాప్ లేకుండా, ఈజీగా నడుచుకుంటూ వస్తున్నారు. ఎంతో ఎనర్జీతో ఆయన వస్తున్నారు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ అప్‌డేట్లు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిసెంబర్ 1 (రేపటి) నుంచి ప్రభాస్ `ప్రాజెక్ట్ కే` చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. దాదాపు కంటిన్యూగా పది రోజులపాటు `ప్రాజెక్ట్ కే` చిత్రీకరణలో పాల్గొంటారట. ఆ తర్వాత డిసెంబర్ మూడో వారంలో `సలార్`లో జాయిన్ అవుతారని సమాచారం. అక్కడ కూడా కంటిన్యూగా షెడ్యూల్ పూర్తి చేయబోతున్నారట. ఇక రెస్ట్ లేకుండా ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారట డార్లింగ్.
`సలార్` ఇంకా 30శాతం చిత్రీకరణ పెండింగ్ ఉందట. పాటలు, యాక్షన్ సీన్ పెండింగ్‌లో ఉందని సమాచారం. ఇందులో నాలుగు పాటలు ఉండనున్నాయట. ఓ ఎండ్ కార్డ్ సాంగ్ ఉంటుందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కోల్ మైనింగ్ నేపథ్యంలో కార్మిక నాయకుడి పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.
మరోవైపు `ప్రాజెక్ట్ కే`కి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకు పెండింగ్ ఉందట. దీనికి చాలా టైమ్ పడుతుందని సమాచారం. ఇటీవలే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయాన్ని తెలియజేశారు. దీనికి సంబంధించిన ప్రతి వస్తువు సొంతంగా తయారు చేయాల్సి వస్తుందట. కిరాయికి తీసుకొచ్చేలా లేవని చెప్పారు. అందుకే టైమ్ పడుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ ఫిక్షన్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు నాగ్ అశ్విన్. దీపికా పదుకొనె ఆయనకు జోడీగా నటిస్తుంది. దిశా పటానీ సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారుడు. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ చూడబోతుంటే ఇది 2024లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు `ఆదిపురుష్` వచ్చే ఏడాది జూన్ 16న రిలీజ్ కానుంది.