తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు.  పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది. పూజా హెగ్డే ఆయన లవ్‌ ఇంట్రెస్ట్ గా నటిస్తుండగా, `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

నేడు(శుక్రవారం) ప్రభాస్‌ బర్త్ డే. ఈ సందర్భంగా తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు ప్రభాస్‌. తాను నటిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రం నుంచి టీజర్‌ని విడుదల చేశారు. ప్రారంభంలో మేఘాల్లో నుంచి ప్రభాస్‌ అరచేయి రావడం, అందులో అడవి క్రియేట్‌ కావడం, ఆ అడవిలో నుంచి చిక్ బుక్‌ రైలు రావడం, ఇందులో ఆనాడు ఓ  రాజులు, రాజ్యాధినేతలు ప్రయాణించే లగ్జరీ ట్రైన్‌లో ప్రభాస్‌, పూజా లవ్‌ డ్యూయెట్‌ పాడుకుంటున్నట్టుగా ఈ టీజర్‌ సాగింది. చివర్లో పూజా కోసం ట్రైన్‌కి వేలాడుతున్నట్టుగా ఉన్న ప్రభాస్‌ రొమాంటిక్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. 

ఈ టీజర్‌ విశేషంగా అలరిస్తుంది. తన అభిమానులకు ట్రీట్‌ ఇవ్వడంతో వారంతా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌ చాలా రోజులు తర్వాత రొమాంటిక్‌ లుక్‌లో కనిపించడంతో ఎగిరి గంతేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది.