ప్రశాంత్ నీల్-ప్రభాస్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ కాంబినేషన్‌పై చర్చ జరుగుతోంది. ఏ రేంజి సినిమా ఈ కాంబోలో రాబోతుందో అని చర్చించుకుంటున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ సింగరేణిలో పూర్తయింది.
చాలా కాలంగా సాగుతూ వస్తున్న‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తి అయ్యింది. దాంతో ‘సలార్’పై ప్రభాస్ ఫుల్ ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు ఈ రోజు నుంచి షూటింగ్ మొదలైంది. రామోజీ ఫిలింసిటీలో ‘సలార్’ షెడ్యూల్‌కు సంబంధించిన భారీ సెట్స్ వేశారు. ఛేజింగ్, ఫైట్స్‌తో ఈ షెడ్యూల్ చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించటానికి సన్నాహాలు చేసారు. అలాగే సినిమాకు కీలకమైన ట్విస్టును కూడా ఈ షెడ్యూల్‌లోనే షూట్ చేస్తారని సమాచారం. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. గ్యాంగస్టర్ గా ప్రభాస్ కనిపించే సీన్స్ షూట్ చేయబోతున్నారు. సినిమాలో భారీ ఎలివేషన్ సీన్స్ అవి అని తెలుస్తోంది.
మరో ప్రక్క దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రం స్క్రీన్ ప్లే లో చిన్న మార్పులు చేశారని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో చిన్న ప్లాష్ బ్యాక్ యాడ్ చేశారట. ఈ ప్లాష్ బ్యాక్ లో ఓ బాలీవుడ్ సీనియర్ స్టార్ కనిపిస్తాడని.. ఈ ప్లాష్ బ్యాక్ మొత్తం చిత్రానికే హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ ప్లాష్ బ్యాక్ లో బాలీవుడ్ స్టార్..నెగిటివ్ రోల్ లో కనిపిస్తారని, అదే కథలో రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ అంటున్నారు. అప్పటిదాకా ఓ విధంగా నడిచిన కథ హఠాత్తుగా మలుపు తీసుకుంటుందని, ఆ ట్విస్ట్ కనుక వర్కవుట్ అయితే సినిమా స్దాయి చాలా రెట్లు పెరుగుతుందని అంటున్నారు. ఈ ప్లాష్ బ్యాక్ విషయమై ఇప్పటికే రైటర్స్ తో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసారని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా 2021 లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట.
ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ను భారీ గా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇంటర్వెల్ ముందు ఓ భారీ బైక్ ఛేజ్ ఉండనుందట. అంతే కాదు అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉండనుందని అంటున్నారు. కథ పరంగా ఎన్నో ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. అలాగే విజువల్ ట్రీట్ ఇచ్చే క్రేజీ ఎలివేషన్స్ తో ఫైట్ సీక్వెన్సులను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. సలార్ షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలో రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్స్ లో వందలాది జూనియర్ ఆర్టిస్టులు యాక్షన్ సీక్వెన్సుల్లో పాల్గొననున్నారని తెలుస్తోంది.
శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
