తమ అభిమాన హీరోల చిన్ననాటి ఫోటోలను చూస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. షూటింగ్‌ సెట్‌ ఫోటోలు చూసి సంబరపడతారు. ఇలా హీరోకి సంబంధించిన ఏ చిన్న కొత్త విషయమైనా ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతారు. అదే ఒక అరుదైన, ఊహించిన విధంగా ఉన్న హీరో ఫోటోని చూస్తే అభిమానుల ఆనందానికి, అనుభూతికి అవదుల్లేవని చెప్పొచ్చు. తాజాగా ప్రభాస్‌ ఫ్యాన్స్ అలాంటి ఆనందానికి, అనుభూతికి లోనవుతున్నారు. తాజాగా ఆయనకు చెందిన ఓ అరుదైన ఫోటో వైరల్‌ అవుతుంది. 

ప్రభాస్‌ ఇందులో విశ్వామిత్రుడి గెటప్‌లో కనిపించడం విశేషం. ఆయన్ని ముని విశ్వామిత్రుడి గెటప్‌లో మేకప్‌ వేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. ఫ్యాన్స్ దీన్ని వైరల్‌ చేస్తున్నారు. ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ని వెతికే ఓ ఆసక్తికర విషయం బయటపడింది. దర్శకుడు రాజమౌళి `యమదొంగ` చిత్రాన్ని ఎన్టీఆర్‌ హీరోగా రూపొందించారు. విశ్వామిత్ర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బ్యానర్‌ లోగో కోసం విశ్వామిత్రుడి గెటప్‌ అవసరం అయ్యిందట.

 ప్రభాస్‌ ఆ లుక్‌కి బాగా సెట్‌ అవుతారని భావించి ఆయన్ని మునీశ్వరుడు విశ్వామిత్రగా రెడీ చేశారు. బ్యానర్‌ లోగోగా పెట్టారు. ఆ ఫోటోనే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అయితే ఈ బ్యానర్‌ కేవలం `యమదొంగ`కే పరిమితమయ్యిందట. ఆ తర్వాత మరే సినిమా ఈ బ్యానర్‌లో రాలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలకు రెడీ అవుతుంది. దీంతోపాటు `ఆదిపురుష్‌`, `సలార్‌` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో సైన్స్ ఫిక్షన్‌ సినిమా చేయబోతున్నారు.