ఈ మధ్య యూనివర్సల్ స్టార్ ప్రభాస్ ను సినిమాల ప్రమోషన్ కు తెగ వాడేస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న కెజియఫ్ 2 కోసం కూడా ప్రభాస్ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ వల్ల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు సంఖ్యం పెరుగుతుంది. ఆడియన్స్ ఎదురుచూసేలా చేసే సినిమాలు ప్రస్తుతం చాలా ఉన్నాయి. అందులో కేజియఫ్ కూడా ఒకటి. ఈసినిమా ఫస్ట్ పార్ట్ సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సెకండ్ ఛాప్టర్ మూవీ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా..రిలీజ్ అయిన ప్రతీ భాషలో సంచలనం సృష్టించింది ఈమూవీ. ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. అన్ని థియేటర్లలోను కదలకుండా కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు కంటీన్యూషన్ గా రాబోతున్న కేజియఫ్2 పై సహజంగానే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
కన్నడ యంగ్ తరంగ్ యశ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సంజయ్ దత్ అథీరాగా కీలకమైన క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో ఈ సినిమా దూసుకుపోయేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ 14న ఈ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన ఇండస్ట్రీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం సలార్ పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజియఫ్ ఛాప్టర్ 2 ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేశారట. దానికోసం పక్కా ప్రణాళికలను తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా స్టార్స్ ను ఈ సినిమా ప్రమోషన్ కోసం వాడబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కెజియఫ్ ప్రమోషన్ కోసం ప్రభాస్ ను రంగంలోకి దింపబోతున్నాడట ప్రశాంత్ నీల్.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దాంతో ప్రభాస్ ఈ వేడుకకి రావడం ఖాయమని అంటున్నారు. ప్రభాస్ కూడా ఈ మూవీకి ప్రమోషన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడని సమాచారం.
