ప్రభాస్ అనుష్కల పెళ్లిపై బ్రేకింగ్ న్యూస్ డిసెంబర్ లో నే ఇద్దరి ఎంగేజ్ మెంట్ అంటూ ఉమైర్ సంథూ ట్వీట్ ఇద్దరూ గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో వున్నారంటూ ట్వీట్
హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలాకాలంగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఈ న్యూస్ విన్నవాళ్ళలో చాలామంది ఈ వార్తని నమ్మలేదు. ఎందుకంటే బిల్లా సినిమా దగ్గరినుంచే ఈ ఇద్దరి మధ్యా ఏదో ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వచ్చినా ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్పటానికి ఏ ఒక్క ఆధారం కూడా కనిపించలేదు.
అనుష్కతో ఎఫైర్ వుందంటూ గతంలో పుకార్లు షికారు చేస్తున్న సమయంలో అదంతా... గాలి వార్తే అంటూ ప్రభాస్ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడప్పుడే తనకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు కాబట్టి ఇక లేడీ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా జోక్ చేశాడు ప్రభాస్. 'ఇక అనుష్కతో పెళ్లి అనవి వచ్చిన వార్తల పై... అటువంటి గాసిప్స్ ఒకప్పుడు బాధించేవి కానీ ఇప్పుడు కాదని... ఎందుకంటే అటువంటి రూమర్స్, గాసిప్స్ ని ఇప్పుడు తాను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాను' అని స్పష్టంచేశాడు ప్రభాస్.
అయితే ఇప్పుడు ఒక న్యూస్ మళ్ళీ విస్తృత స్థాయిలో ప్రచారంలోకి వచ్చింది. ఈ సారి పుకారు మాత్రమే అంటూ తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే... ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు వీళ్ల ఇద్దరికి సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ వెల్లడించాడు. వాల్లిద్దరూ డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారని ట్వీట్ చేశాడు. అను,క, ప్రభాస్ ఇద్దరూ ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వెల్లడించాడు. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఈ విషయాన్ని ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ తనకు చెప్పాడని... వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు చాలా కేర్ తీసుకుంటారని చెప్పాడు. ఏది నిజమో ప్రభాస్, అనుష్కల్లో ఎవరైనా ఒకరు చెబితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
