ప్రభాస్ .. అనుష్క వీరిద్దరి మధ్యా చాలా కాలంగా ఏదో నడుస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం  వరుస సినిమాలు చేస్తూ రావడం కావచ్చు.  వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం రూమర్స్ ఎంతదూరం వెళ్లాయంటే బాలీవుడ్ మీడియా సైతం వాటిని హైలెట్ చేస్తూ కథనాలు రాసింది. అయితే ఎప్పటికప్పుడూ వీళ్లిద్దరూ తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ చెప్పుకొస్తున్నారు. 

దాంతో సాధ్యమైనంతవరకూ వీరిద్దరూ కలిసి మీడియా దృష్టిలో పడకుండా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ .. అనుష్క  జపాన్ వెళ్లనున్నారనే వార్త బయటికి వచ్చింది. దాంతో వీళ్ళిద్దరూ జపాన్ వెళ్లేది అక్కడ సరదాగా ఎంజాయ్ చేయటానికే అంటూ కొన్ని మీడియా వర్గాలు ప్రచారం ప్రారంభించేసాయి. 

అయితే వాస్తవానికి  వీరు జపాన్ వెళ్లేది అక్కడ రిలీజ్ కానున్న జపనీస్ వెర్షన్  'మిర్చి' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికని తెలుస్తోంది. 'బాహుబలి' తరువాత జపాన్ లోను ప్రభాస్.. అనుష్కలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో అంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మిర్చి'ని అక్కడ విడుదల చేస్తున్నారు. మార్చి రెండవ తారీకున ఈ సినిమా స్క్రీనింగ్ జరగబోతోంది. 

ప్రమోషన్స్ లో పాల్గొనమంటూ అక్కడి డిస్ట్రిబ్యూటర్ పంపిన ఆహ్వానం మేరకు ఈ ఇద్దరూ వెళ్లనున్నట్టు సమాచారం. అంతేకాదు  ప్రభాస్ నటించిన 'డార్లింగ్' సినిమాను కూడా అక్కడ విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.