బాహుబలి స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు స్టార్ డైరెక్టర్ రాజమౌళికి అత్యంత సన్నిహితులనే విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ తో ఇప్పటికే స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలను రూపొందించిన రాజమౌళి ఇప్పుడు మరోసారి 'RRR' సినిమా కోసం ఎన్టీఆర్ తో కలిసి పని చేస్తున్నాడు.

ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ని ఎంతగా పెంచేశాడో తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి రాజమౌళి కొడుకు కార్తికేయ కోసం స్పెషల్ పార్టీని హోస్ట్ చేయబోతున్నారని సమాచారం. కార్తికేయ.. నటుడు జగపతిబాబు అన్నయ్య కూతురు పూజా ప్రసాద్ ని ప్రేమించాడు.

ఇద్దరికీ ఇటీవల నిశ్చితార్ధం కూడా జరిగింది. జనవరి 5న ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది. దీనికోసం రాజస్థాన్ లోని విలాసవంతమైన సెవెన్ స్టార్ హోటల్ వేదిక కానుంది. పెళ్లి వేడుకలు పూర్తైన తరువాత ప్రభాస్, ఎన్టీఆర్ లు కొత్త జంట కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయనున్నారు. ఇండస్ట్రీలో ప్రముఖులు అందరూ ఈ పార్టీలో దర్శనమిస్తారట.

ఎవరూ మిస్ కాకుండా అందరి డేట్స్ ని బట్టి ఒక తారీఖుని ఖరారు చేసి ఈ పార్టీ నిర్వహించబోతున్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరూ ఇలాంటి పార్టీ ఇచ్చి ఉండరని అందరూ అనుకునే విధంగా పార్టీని హోస్ట్ చేస్తారట.ఇంకా పార్టీ డేట్ మాత్రం ఫైనల్ కాలేదని తెలుస్తోంది.