సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసంతృప్తితో ఉన్నాడా..? ప్రభాస్ విధానం ఆయనకు నచ్చడంలేదా..? యంగ్ రెబల్ స్టార్  సలార్ డైరెక్టర్ ను టెన్షన్ పెడుతున్నాడా..? అసలు ప్రశాంత్ నీల్ అలకకు కారణం ఏంటి..? ఆయన ఏం చేయబోతున్నాడు...?

బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. హిట్ అయినా.. ఫట్ అయినా.. వరుసగా పాన్ ఇండియా సినిమలు ఆయన గుమ్మంముందు ఎదురు చూస్తున్నాయి. అటు కెజియఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ పరిస్థితి కూడా అదే. వరుసగా స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి కబురు పెడుతూనే ఉన్నారు. ప్రభాస్ బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్ తో రెండు ప్లాప్ లు ఫేస్ చేశారు. అయినా సరే ఆయన చేతిలో ఇప్పుడు నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ కెజియఫ్ రెండు సినిమాల తరువాత ప్రభాస్ తో సలార్, ఎన్టీఆర్ తో మరో సినిమా ఫిక్స్ అయి ఉన్నాడు. 

అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. కెజియఫ్ రిలీజ్ అవ్వక ముందే ప్రభాస్ తో సలార్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాకు తగ్గట్టు ప్రశాస్ ను మేకోర్ అవ్వమనిచెప్పాడు. చెప్పినట్టు ప్రభాస్ తనను తాను మార్చుకున్నాడు. అయితే అందుకు ముందే ప్రభాస్ మరో మూడు సినిమాలకు డేట్స్ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రభాస్ కోసం వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. నార్త్ లో సైతం ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోవడంతో... ప్రభాస్ తో సినిమాలు చేయడానికి మేకర్స్ క్యూ కడుతున్నారు. ప్రభాస్ కూడా వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. 

అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ కే మరియు బాలీవుడ్ సినిమాగా రూపొందుతున్న ఆదిపురుష్ ఉన్నాయి. ఇలా అన్ని సినిమాలలో ప్రభాస్ ఒకేసారి నటిస్తుండటంపై ప్రశాంత్ నీల్ కొంత అసంతృప్తితో ఉన్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. 

 ప్రభాస్ ను సలార్ కు తగ్గట్టుగా మార్చేశారు టీమ్. అది కాకుండా ప్రభాస్ నటిస్తున్నమరో రెండు సినిమాల్లో ఆయన లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. అందులోనూ.. సలార్ కంప్లీట్ యాక్షన్ మూవీ కావడంతో ప్రభాస్ లుక్ ను మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. అంతే కాదు సలార్ లో ప్రభాస్ ఫిజిక్ కుచాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదే టైమ్ లో ప్రభాస్ మూడు సినిమాల కోసం ప్రయాణాలు చేస్తుండటంతో.. లుక్ ను మెయింటేన్ చేయడం కష్టం అవుతోంది. దాంతో సినిమా విషయంలో చాలా తేడా వస్తోందట.

అవుట్ పుట్ లో ప్రభాస్ లుక్ లో తేడా స్పస్టంగా కనిపిస్తుండటంతో ప్రశాంత్ నీల్ కు టెన్షన్ పట్టుకుందట. ఈ కారణంగానే ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారని చెపుతున్నారు. మరి ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఎలా డిస్కర్స్ చేస్తారు. అవుట్ పుట్ విషయంలో ప్రశాంత్ నీల్ డామేజ్ కంట్రోల్ ప్లాన్ ఏంటీ.. అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్ ఏం నిర్ణయం తీసుకుంటాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో.