తాజాగా సోనాలి బింద్రేపై ఒక షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది. ఇటీవల ఆమె మహారాష్ట్ర రాజకీయ నాయకుడు రాజ్ ఠాక్రేతో కలిసి ఓ ఈవెంట్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
సోనాలి బింద్రే డేటింగ్ రూమర్స్
తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తాజాగా వార్తల్లో నిలిచారు. హీరోయిన్లపై తరచుగా రూమర్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా సోనాలి బింద్రేపై ఒక షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది. ఇటీవల ఆమె మహారాష్ట్ర రాజకీయ నాయకుడు రాజ్ ఠాక్రేతో కలిసి ఓ ఈవెంట్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గతంలో సోనాలి బింద్రే.. రాజ్ ఠాక్రేతో డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కనిపించడం చర్చనీయాంశం అయింది. అయితే తన గురించి వస్తున్న రూమర్స్ పై సోనాలి బింద్రే క్లారిటీ ఇచ్చారు.
స్పందించిన సోనాలి బింద్రే
ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని సోనాలి బింద్రే తేల్చిచెప్పారు. “ఇది చాలా దారుణమైన ప్రచారం. ఇలాంటి అసత్యాలని వార్తలుగా ఎలా ప్రచారం చేస్తారో అర్థం కావడం లేదు” అంటూ ఆమె స్పందించారు. ఆమె స్పష్టం చేస్తూ, “మా కుటుంబం, రాజ్ ఠాక్రే కుటుంబం చాలా కాలం నుంచి మంచి స్నేహితులం. చిన్నతనం నుంచి రాజ్ ఠాక్రేతో పరిచయం ఉంది. అది స్నేహం మాత్రమే. ప్రేమ సంబంధం అన్నదే ఎప్పుడూ లేదు” అని చెప్పారు.
సోనాలి బింద్రే తెలుగు చిత్రాలు
ప్రస్తుతం 50వ సంవత్సరం పూర్తి చేసుకున్న సోనాలి గతంలో టాలీవుడ్‌లో మహేష్ బాబు 'మురారి'.. చిరంజీవి 'ఇంద్ర', శంకర్ దాదా ఎంబిబిఎస్.. నాగార్జున మన్మథుడు.. కృష్ణ వంశీ ఖడ్గం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో క్యారెక్టర్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆమె భర్త గోల్డీ బెహెల్ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత. దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.
సోనాలి బింద్రే గతంలో క్యాన్సర్‌ను జయించి మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి గాసిప్స్ సృష్టించడం బాధాకరమని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా వ్యక్తిగత జీవితం మీద కామెంట్లు చేయడం తగదని ఆమె అభిప్రాయపడ్డారు.
