ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. `రాధేశ్యామ్‌` షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మరోవైపు `సలార్‌` షూటింగ్‌లో, దీంతోపాటు `ఆదిపురుష్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్‌ న్యూ లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆయన ఇటీవల ముంబయిలో ఓ అభిమానితో ఫోటో దిగారు. అంతేకాదు అతని `ఆదిపురుష్‌` లుక్‌ అంటూ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. దీంతో `ఆదిపురుష్‌`లో ప్రభాస్‌ లుక్‌ ఇదేనంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 

ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` సినిమా రూపొందుతుంది. రామాయణం ప్రధానంగా సాగే చిత్రమిది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. ఆ మధ్య సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఓపెనింగ్‌ రోజే భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కొన్నాళ్లపాటు షూటింగ్‌ వాయిదా వేశారు. మళ్లీ ఇటీవల ప్రారంభించారని, ఆ సినిమా షూటింగ్‌ కోసం ముంబయి వెళ్లిన ప్రభాస్‌ షూటింగ్‌ సమయంలో ఫ్యాన్‌తో ఫోటో దిగినట్టు తెలుస్తుంది.  ఇందులో ప్రభాస్‌ కళ్లజోడు, తలకు క్యాప్‌ పెట్టుకుని పొడుగు మీసాలతో కనిపిస్తున్నాడు. ఆయన లుక్‌ నిజంగానే పవర్‌ ఫుల్‌గా ఉంది. 

ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తుంది. సీతగా కృతి సనన్‌ పేరు వినిపిస్తుంది. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపొందుతుంది. మరోవైపు ప్రభాస్‌ `సలార్‌` సైతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇది రామగుండంలోని బొగ్గుగనుల్లో ఇటీవల షూటింగ్‌ జరిపిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న `రాధేశ్యామ్‌`లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని జులై 30న విడుదల చేయబోతున్నారు.